ట్రెండింగ్ ప్రభాస్ బర్త్ డే.. మెసేజ్‌ల వెల్లువ.. అమ్మాయిల గుండె జారేలా చేశావు అంటూ..

Recommended Video

Twitter Pours Wishes To Prabhas On His Birthday

బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డార్లింగ్ అంటూ పలువురు విషెస్‌తో ముంచెత్తుతున్నారు. బాహుబలి విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు చేసిన ట్వీట్లు మీ కోసం..

ప్రభాస్‌కు బర్త్ డే విషెస్

బాహుబలికి జన్మదిన శుభాకాంక్షలు. సాహోకు బెస్ట్ విషెస్. భవిష్యత్‌లో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి. ప్రభాస్ హ్యాపీ బర్త్ డే అంటూ బాహుబలి టీమ్ జన్మదిన శుభాకాంక్షలు అందజేసింది.

ఇషా రెబ్బా ట్వీట్‌తో

మెనీ మెనీ హ్యాపీ బర్త్ రిటర్న్ ఆఫ్ ది డే డార్లింగ్ ప్రభాస్ అంటూ అరవింద సమేత హీరోయిన్ ఇషా రెబ్బా ట్వీట్ చేసింది. కేకు. ఫ్లవర బోకేతో ప్రభాస్‌పై ప్రేమను కురిపిచింది.

ప్రభాస్‌కు సురేష్ ప్రొడక్షన్ విషెస్

ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరింత పేరు తేవాలని ఆకాక్షిస్తున్నాం అని సురేష్ ప్రొడక్షన్ ట్వీట్ చేసింది.

ప్రభాస్ డార్లింగ్ అంటూ మెహర్

హ్యాపీ బర్త్ డే ప్రభాస్ డార్లింగ్. మై బిల్లా. ఎప్పుడూ సంతోషంగా, విజయంతో ముందుకు సాగిపోవాలి అని దర్శకుడు మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.

వెన్నెల కిషోర్ విషెస్‌తో ఏమన్నారంటే

నేషన్ డార్లింగ్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. జెంటిల్మన్‌గా మీ మంచితనం, ప్రవర్తన ప్రతీ ఒక్కరు పొందాలి. మీతో షూటింగ్‌ అంటే భూమి మీద స్వర్గమే అని వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.

దక్షిణాది సూపర్‌స్టార్ అని

దక్షిణాది సూపర్ స్టార్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అమ్మాయిలు, అబ్బాయిలు డార్లింగ్ బర్త్ డేను మీరు పండుగ చేసుకోండి అని క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

అమ్మాయిల గుండె చప్పుడు

నీ జన్మదినం రోజున ఏం చెప్పాలి. నీ స్క్రీన్ ప్రజెన్స్‌తో దేశంలోని అమ్మాయిల గుండె చప్పుడు జారేలా చేశావు. అమరేంద్ర, మహేంద్ర బాహుబలిని లెజెండ్‌గా చేశావు. నీ మోహం, ప్రేమలో పడేలా నన్ను చేశావు అని బాలీవుడ్ నటి మున్‌మున్ దత్తా ట్వీట్ చేసింది.

ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్

ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది మరింత విజయాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. మరింత శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించేలా చేయాలని కోరుకొంటున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.

నాకు ఇన్సిపిరేషన్

హ్యాపీ బర్త్ డే రెబెల్ స్టార్. సంచలన విజయం చేజిక్కించుకొన్నప్పటికీ.. ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా ఉండటం నీకే సాధ్యం. నాలాంటి వారికి మీరు ఇన్సిపిరేషన్ అంటూ హీరో శ్రీ విష్ణు ట్వీట్ చేశారు.

బ్రదర్ అంటూ రానా దగ్గుబాటి

బ్రదర్.. హ్యాపీ బర్త్ డే అంటూ సింపుల్‌గా ప్రభాస్‌కు భళ్లాలదేవుడు ప్రభాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. వారి స్నేహానికి ప్రతీకగా నిలిచిన బాహుబలి చిత్రంలోని అద్భుతమైన ఫొటోను షేర్ చేశాడు.

సిద్ధం చేసుకోమని తమన్ ట్వీట్

హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. కొద్ది సమయంలో సాహోకు సంబంధించిన మ్యూజిక్ అభిమానులకు గిఫ్ట్‌గా ఇవ్వనున్నాం. ఇయర్ ఫోన్స్ సిద్దం చేసుకోండి అంటూ తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

యూనివర్సల్ డార్లింగ్ అని

యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే. చాలా నిజాయితీతో కూడిన వ్యక్తి. మంచి మనసు ఉన్న మనిషి. విజయాలతో గర్జించు. పాలించు. నీకోసం నా ప్రేమ, దీవెనలు ఉంటాయి అని నటుడు మురళీ శర్మ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X