ఆ ముగ్గురే ఇష్టమన్న త్రిష.. కావాలనే తెలుగు హీరోలను అవమానించిందా?.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్

దాదాపుగా దశాబ్ద కాలం అగ్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌ను ఏలింది త్రిష. స్టార్ హీరోలే కాకుండా యువ హీరోలందరితోనూ నటించిన త్రిష.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొట్టింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకీ ఇలా సీనియర్ హీరోల సరసన నటించిన త్రిష.. పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్‌తోనూ జత కట్టింది. త్రిష ఒకప్పుడు యూత్ కలల రాణి. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా వంటి క్యూట్ లవ్ స్టోరీస్‌తో అందర్నీ కట్టిపడేసింది.

సైడ్ క్యారెక్టర్స్‌తో..

సైడ్ క్యారెక్టర్స్‌తో..

సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది త్రిష. మొత్తం దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న త్రిష.. కోలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్‌లో మొదలు పెట్టింది. జోడి, యువ వంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ పోషించిన త్రిష.. కోలీవుడ్ స్టార్స్ అందరితోనూ నటించింది.

దాదాపు స్టార్స్ అందరితో..

దాదాపు స్టార్స్ అందరితో..


కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అందరితో నటించిన త్రిష.. ఆపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ కనిపించింది. అయితే అవి అంతగా ఆకట్టుకోలేకపోయింది. 96 సినిమాతో మళ్లీ త్రిష హవా మొదలైంది. అక్కడి నుంచి త్రిషకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. ప్రస్తుతం త్రిషకు భారీ డిమాండ్ ఏర్పడింది.

 ఆ ముగ్గురే ఇష్టం..

ఆ ముగ్గురే ఇష్టం..

తాజాగా త్రిష సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఛాటింగ్ చేస్తూ... నచ్చిన ముగ్గురు బెస్ట్ హీరోల ఎవరిని అడిగితే.. . కమల్ హాసన్, మోహన్ లాల్, ఆమీర్ ఖాన్ అని చెప్పింది. దీంతో తెలుగు సినీ ప్రేక్షకులు ఖంగు తిన్నారు. అయితే తాజాగా ఏర్పడిన పరిస్థితుల వల్లే అలా కావాలని చెప్పిందా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Actress Trisha Krishnan Grand Entry Into Tik Tok, Here Is The First video
 ఆచార్య నుంచి అవుట్..

ఆచార్య నుంచి అవుట్..

త్రిష ఆచార్య నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఈ ఘటనలో చిరు, త్రిష వాదనలు భిన్నంగా ఉన్నాయి. అందుకే త్రిష టాలీవుడ్‌పై కోపంగా ఉందని, అందుకే తెలుగు హీరోల్లో ఎవరి పేరు చెప్పలేదని కొందరు అంటుంటే.. మరికొందరు త్రిషను సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిష్టం వారిదే..త్రిషకు నచ్చనంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని లైట్ తీసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X