త్రిష ఇంతలా కిక్కిస్తుందేంటి..? ఈ టైమ్‌లో ఎవరి కోసం ఇదంతా? అందరి డౌట్ దానిపైనే!
Recommended Video
దాదాపు 18 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తోంది అందాల తార త్రిష. సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న త్రిష మరింత కిక్కిస్తోంది.

ఉన్నట్టుండి సోషల్ మీడియాలో
ఉన్నట్టుండి సైలెంట్‌గా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ప్రారంభించింది త్రిష. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నేటితరం హీరోయిన్లకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.

తరచూ వెకేషన్స్.. ఎంజాయ్
సినిమాలతో పాటు తరచూ వెకేషన్స్ ఎంజాయ్ చేసే త్రిష ఇటీవలే మాల్దీవుల్లో షికారు చేసింది. అక్కడి బీచ్‌లలో తన అందాలకు పదును పెడుతూ ఫొటోలకు పోజిచ్చి కుర్ర హీరోయిన్లకు ఈర్ష కలిగేలా చేసింది.

స్విమ్ సూట్‌లో క్లీవేజ్ కిక్
స్విమ్ సూట్‌లో తన సోయగాలు ఆరబోస్తూ యువతకు గాలం వేస్తోంది త్రిష. ఆమె అందాలు చూసి అప్పటి హీరోయిన్ అయినా నేటి హీరోయిన్లను మించిన కిక్ ఇస్తోందిగా అని చెప్పుకుంటున్నారు. ఈ చెన్నై సుందరి హాట్ పోజులు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.

ప్లాన్ అదే..
దాదాపు 35 ఏళ్ల వయసులో ఉన్న త్రిష.. యంగ్ హీరోయిన్స్‌ని మించి వేడి పుట్టిస్తోంది. అయితే తన లోని హాట్‌నెస్ బయట పెడుతున్న ఈమె మరిన్ని సినిమా అవకాశాలు పట్టే ప్లాన్ చేస్తోందట.

హుషారుగా ఉన్నపుడే డీల్ చేయమంటూ
ఈ మేరకు గతంలో తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ 'తాను హుషారుగా ఉన్నపుడే తనను డీల్ చేయాలనేది తన సలహా' అని పేర్కొంది త్రిష. అంటే అమ్మడు వెండితెరపై ఇంకా అందాలు ఆరబోస్తానని పరోక్షంగా చెప్పేసిందన్నమాట.

త్రిష ఫిట్‌నెస్ చూస్తుంటే
ఇక త్రిష ఫిట్‌నెస్ చూస్తుంటే ఇంకో పదేళ్ల పాటు సౌత్ సినిమా హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. బీచ్ ఒడ్డున ఒలకబోసిన అందాల్లో ఒంటిపై ఉన్న టాటూలు బాగా ఫోకస్ అవుతున్నాయి.

విజయ్ సేతుపతి, రజినీకాంత్
ఇటీవలే విజయ్ సేతుపతి సరసన నటించిన '96' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న త్రిష.. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'పేట' సినిమాతో అలరించింది. అంటే సీనియర్ హీరోలతో జత కట్టేందుకు రెడీ అయిందన్నమాట.

మరోసారి చిరంజీవితో
గతంలో చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో ఆడిపాడిన త్రిష.. మరోసారి మెగాస్టార్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అందుకోసమే ఇలా సోషల్ మీడియా సెగలు పుట్టిస్తోందని అంటున్నారు.

చిరు 152లో..?
చిరంజీవి కెరీర్ లో రాబోతున్న 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకోబోతున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు ఇలా కూడా
మరోవైపు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది త్రిష. మరికొద్ది రోజుల్లో ఆమె నటించిన హారర్ సినిమా 'గర్జనై' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











