మామ నీకిదే చివరిది.. రానాకు త్రిష భలే చురక.. మళ్లీ పట్టాలెక్కిన లవ్ ట్రాక్!

Recommended Video

Is Trisha - Rana Relationship Back On Track?? | FilmiBeat Telugu

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరోసారి రానా దగ్గుబాటి, త్రిష అఫైర్‌ విషయం చర్చనీయాంశమైంది. ఈసారి హీరో ఆర్య, సాయేషా పెళ్లి వార్తతో వీరి రిలేషన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల హీరో, హీరోయిన్లు ఆర్య, సాయేషా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. ఆర్య పెళ్లి నేపథ్యంలో రానా, త్రిషాలు ట్వీట్ చేయడంతో మళ్లీ వీరిద్దరు ఒకటయ్యారా? అనే చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే..

ఆర్య, సాయేషా పెళ్లిపై రానా, త్రిషా

ఆర్య, సాయేషా పెళ్లి చేసుకొంటున్నట్టు అధికారికంగా వార్త రావడంతో పలువురు హీరో, హీరోయిన్లతోపాటు రానా, త్రిషా సోషల్ మీడియాలో స్పందించారు. మచ్చా కంగ్రాట్యులేషన్. హ్యాపీ వాలంటైన్స్.. నీకు ఇదే చివరి ప్రేమికుల రోజు అని రానా ట్వీట్ చేశాడు. చివరకు తాను అనుకొన్నది సాధించాడు. కాబోయే దంపతులకు నా కంగ్రాట్స్ అని త్రిషా ట్వీట్ చేశారు.

రానా, త్రిషా ట్వీట్లపై ఆర్య కామెంట్

రానా, త్రిషా ట్వీట్లపై హీరో ఆర్య ఆసక్తికరంగా స్పందించాడు. హా..హా.. థ్యాంక్స్ మచా.. మీ పెళ్లి పిలుపు కోసం వేచి చూస్తున్నాను అని ఆర్య ట్వీట్ చేయడంతో రానా, త్రిషా వ్యవహారం మళ్లీ ట్రాక్ ఎక్కిందా అనే వాదన జోరందుకొన్నది. త్రిషాకు మళ్లీ రానా చేరువయ్యాడనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అదే నిజమైతే ఈసారి రానా, త్రిషా ఒక్కటవ్వడం ఖాయమంటున్నారు.

త్రిషా బ్రేకప్స్ ఇలా

త్రిషా బ్రేకప్స్ ఇలా

ఇదిలా ఉండగా, రానా, త్రిషా ప్రేమకు ఇరు కుటుంబాలు ఆమోద ముద్ర వేయకపోవడంతో వారి ప్రేమ పెళ్లి వరకు రాలేకపోయింది. దాంతో గత కొద్దికాలంగా వారి మధ్య రిలేషన్‌కు గండిపడింది. అప్పటి నుంచి వారిద్దరూ ట్విట్టర్‌లో కూడా ఒకరిని మరొకరు ఫాలో కావడం లేదు. దాంతో కొంత గ్యాప్ ఏర్పడింది.

కెరీర్‌పైనే త్రిషా దృష్టి

కెరీర్‌పైనే త్రిషా దృష్టి

రానాతో బ్రేకప్ తర్వాత ఓ వ్యాపారవేత్త వరుణ్ మానియన్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి త్రిషా ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టిన త్రిషా భారీ విజయాలను సొంతం చేసుకొన్నది.

 మళ్లీ చిగురించిన రానా, త్రిష ప్రేమ

మళ్లీ చిగురించిన రానా, త్రిష ప్రేమ

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల రానా ఓ ఇంటర్వ్యూలో త్రిషా గురించి స్పందించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. త్రిషా నాకు మంచి స్నేహితురాలు. మీమిద్దరం డేటింగ్ చేసిన విషయం నిజమే. కానీ కొన్ని కారణాల వల్ల మా రిలేషన్ బలపడలేదు అని రానా అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మళ్లీ, రానా, త్రిషాలు దగ్గరైనట్టు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమ పెళ్లిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X