మా బాలయ్య తోనే అది మొదలైంది.. నటసింహంపై దర్శకేంద్రుడి కామెంట్స్
నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సినీ హీరోలు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ బాలయ్య బాబుకు విషెస్ తెలుపుతున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ ట్వీట్లతో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మోహన్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ క్రిష్ తెలిపిన విషెస్ తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య బర్త్ డే..
బాలయ్య బాబు 60వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బాలయ్యకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ మొత్తం బాలయ్యను విష్ చేస్తోంది. సినీయర్ హీరోల కుర్ర హీరో, హీరోయిన్లు బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

నందమూరి వారసుల ట్వీట్స్..
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాబాయ్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనలోని అభిమానాన్ని తట్టి లేపింది, చూసిన మొట్టమొదటి హీరో బాలయ్యేనని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉన్నారని కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనయ్యారు.

సోదరుని కుమారుడు..
అన్నగారు అని ఎన్టీఆర్‌ను ప్రేమగా పిలిచే మోహన్ బాబు ‘నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను'ని బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు.
Recommended Video

దర్శకేంద్రుడు, క్రిష్ విషెస్..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేస్తూ.. ‘60వ వసంతం లోకి అడుగుపెడుతున్న మా బాలయ్య కి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ RK Films అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్య తోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాన'ని తెలిపాడు. క్రిష్ స్పందిస్తూ.. ‘60వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్య బాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి ఘనమై పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ' అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











