For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆఫర్లు లేక భీమవరంలో క్రికెట్ ఆడుకుంటుంటే.. తొలి ఆఫర్ ఇచ్చిన నిర్మాతకు త్రివిక్రమ్ పాదాభివందనం

  |

  రచయితగా ఎదుగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా చేసి మాటల మాంత్రికుడిగా మారేందుకు దోహదపడిన నువ్వే నువ్వే చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్.. కెరీర్ ఆ సినిమా తర్వాత రివ్వున దూసుకెళ్లింది. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్, శ్రీయా సరన్ జంటగా నటించారు. అద్బుతమైన విజయం సాధించిన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్బంగా ప్రత్యేకంగా ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ..

  నాలుగు సిగరెట్లు కాల్చే సమయంలో

  నాలుగు సిగరెట్లు కాల్చే సమయంలో


  వనమాలిహౌస్‌లో నువ్వే కావాలి షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తుండగా నువ్వే నువ్వే కథ చెప్పాను. అప్పట్లో నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. నాలుగు సిగరెట్లు కాల్చే సమయంలో కథ చెప్పా. కథ విన్న వెంటనే ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. నువ్వే కావాలికిరైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో... దాదాపుగాఅంతఅమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికినేను రాసిన 'నువ్వే కావాలి' షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనోతెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు.ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమను బయటకు చెబితే పలచబడిపోతుంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

  స్వయంవరం తర్వాత ఆఫర్లు లేక

  స్వయంవరం తర్వాత ఆఫర్లు లేక


  మద్రాసులో నీరం అనే మలయాళ సినిమా చూసి అందులో సన్నివేశాలనునా ఇష్టం వచ్చినట్లు మార్చేస్తూ కథ చెబుతుంటే రవికిశోర్ గారు విన్నారు. స్వయంవరం సినిమాకు డైలాగ్స్ రాసిన తర్వాత నన్ను ఎవరూపిలవకపోతే నేను భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కనఎస్టీడీ బూత్ నంబర్ కనుక్కుని రవికిశోర్ గారు నాకు ఫోన్ చేసి అవకాశం ఇచ్చారు. నువ్వు నాకు నచ్చావ్ కథను పెద్ద హీరోకి మాత్రమే చెబుతానని వాదిస్తే 'నీ ఇష్టం వచ్చినట్టు చావు' అని రవికిశోర్ గారు ప్రోత్సహించారు అని త్రివిక్రమ్ భావోద్వేగానికి లోనయ్యారు.

  రవికిషోర్ లాంటి రసికుడిని

  రవికిషోర్ లాంటి రసికుడిని


  నేను రాసిన డైలాగ్స్ రాత్రిపూట స్క్రిప్ట్ చదివి.. నచ్చితే ఫోన్ చేసి ఏడ్చిన రవికిశోర్ గారు... నేను పంజాగుట్టలో ఉన్నప్పుడు మా రూమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి హారన్ కొట్టి పిలిచే రవికిశోర్ గారు... ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడినినాకు ఇచ్చినందుకుదేవుడికి నేను ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పాలి అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషనల్ అయ్యారు.

  ఫైట్ మాస్టర్ లేకపోతే..

  ఫైట్ మాస్టర్ లేకపోతే..


  నువ్వే నువ్వే మూవీ కోసం ఢిల్లీకి వెళ్లిశ్రీయ‌తో పాటు వాళ్ళ అమ్మకు కథ చెప్పడం నుంచి శ్రీనగర్ కాలనీలో రవికిశోర్ గారి ఆఫీసులో అందరికీ స్క్రిప్ట్ రీడింగ్ఇవ్వడం నుంచి ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్లడం, ఊటీలో షూటింగ్ చేయడం... ప్రతిదీఇప్పటికీ గుర్తు. 'నువ్వే నువ్వే' షూటింగ్‌లో ఫైట్ మాస్టర్ లేకపోతే తరుణ్ చేత ఒక కిక్ కొట్టించే సీన్ చేశా. అప్పుడు నాలో వయలెన్స్ ఉందని అర్థమైంది. 'అతడు' తీసిన తర్వాత వెంకటేష్ గారు 'నువ్వు చూస్తే సాఫ్ట్ గా ఉంటావ్. సినిమా వైలెంట్ గా తీశావ్' అన్నారు. ఆ వయలెన్స్ 'నువ్వే నువ్వే'లో కిక్ తో స్టార్ట్ అయ్యింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అనుభూతులను గుర్తు చేసుకొన్నారు.

  సిరివెన్నెల సీతారామశాస్త్రికి

  సిరివెన్నెల సీతారామశాస్త్రికి


  నాలో ఉన్న రచయితనుగానీ... దర్శకుడిని గానీ... నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్నునేను చాలా ప్రేమిస్తా. గౌరవిస్తా. రవికిశోర్ గారు అనడమే వచ్చు. నాకు ఆయన అన్నలాగా! ఆయనకు, సీతారామశాస్త్రి గారి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. అందుకు నేను సాక్షిని. గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?' అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఆయన మాటల్లో చెప్పాలంటే... 'ఆయన ఉఛ్వాసం కమలం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం'. అటువంటి సిరివెన్నెలసీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర బృందం నివాళిగా అర్పిస్తున్నాం'' అని అన్నారు. దర్శకుడిగా తనను పరిచయం చేసిన 'స్రవంతి' రవికిశోర్ పాదాలకు ఈ సందర్భంగా త్రివిక్రమ్ నమస్కరించారు.

  English summary
  Popular Writer Trivikram Srinivas's directorial movie Nuvve Nuvve completed 20 years. In this occasison, Special Show was organised at AMB. In this occassion, Trivikram Srinivas shows gratitude by touching feets of Sravanti Ravi Kishore at 20 years of Nuvve Nuvve event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X