Uday Kiran Birth Anniversary: కోట్లు తెచ్చిపెట్టిన సినిమాకు 11వేల రెమ్యునరేషన్.. మల్టీస్టారర్ రిజెక్ట్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బెస్ట్ లవర్ బాయ్ హీరోగా క్రేజ్ అందుకున్న వారిలో ఉదయ్ కిరణ్ టాప్ లిస్టులో ఉంటాడని చెప్పవచ్చు. అతను మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా జనాలు ఏ మాత్రం మర్చిపోలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధనవుతోంది. నేడు ఉదయ్ కిరణ్ జయంతి కావడంతో అందరూ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఉదయ్ కిరణ్ కూడా తన కెరీర్ లో కొన్ని మంచి సినిమాలను వదుకుకున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. ఒక మల్టీస్టారర్ సినిమా అయితే నచ్చకనే మిస్ చేసుకున్నట్లు ఒక దర్శకుడు కూడా చెప్పాడు.

మొదటి ఛాన్స్
ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమా కోసం దర్శకుడు తేజ మొదట ఒక హిందీ యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ను ఒక సైడ్ రోల్ కోసం ఫిక్స్ చేశారు. కానీ హిందీ యాక్టర్ చేయనని అనడంతో ఉదయ్ కిరణ్ ను ఫిక్స్ చేశారు.

చిత్రం రెమ్యునరేషన్
చిత్రం సినిమాను రామోజీరావు ప్రొడక్షన్ లో నిర్మించారు. 40లక్షల్లో అనుకున్న ఆ సినిమా బడ్జెట్ చివరికి 42లక్షలు అయ్యింది. ఇక ఆ సినిమాకు ఉదయ్ కిరణ్ అందుకున్న రెమ్యునరేషన్ 11వేలు. దాదాపు అందరికి అదే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు దర్శకుడు తేజ వివరణ ఇచ్చారు. ఇక బాక్సాఫీస్ వద్ద చిత్రం 8కోట్ల వరకు కలెక్ట్ చేసిందని కూడా అన్నారు.

మాధవన్ చేయాల్సిన సినిమా
చిత్రం సినిమా హిట్టయినా కూడా ఉదయ్ కిరణ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఆ తరువాత మళ్ళీ డైరెక్టర్ తేజతోనే తిరిగేవాడు. ఇక నువ్వు నేను కథ కోసం మాధవన్ ను అనుకున్నప్పుడు అతను తెలుగు సినిమాలు చేయనని ఆనేశాడు. ఇక వెంటనే మళ్ళీ ఉదయ్ కిరణ్ ను అలా అదృష్టం వరించింది.

కోట్లను తాకిన రెమ్యునరేషన్
నువ్వు నేను టైమ్ లోనే మనసంతా నువ్వే సినిమాకు కూడా వర్క్ చేశారు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడంతో ఉదయ్ కిరణ్ రెమ్యునరేషన్ ఒక్కసారిగా కోట్లను తాకింది. ఇక ఆ తరువాత అతనికి ఎక్కువ కాలం సక్సెస్ నిలవలేదు. అయితే ఉదయ్ మధ్యలో కొన్ని మంచి ఆఫర్స్ కూడా వదుకుకున్నాడు. ఎందుకో గాని పూరి జగన్నాథ్ తో ఒక సినిమా అనుకోని మొదట్లోనే ఆగిపోయిందట.

మల్టీస్టారర్ మూవీ రిజెక్ట్ చేసి..
ఇక దర్శకుడు రవిబాబు ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ మిస్ చేసుకున్న మల్టీస్టారర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. సోగ్గాడు సినిమాలో ఫస్ట్ తరుణ్ - ఉదయ్ కిరణ్ ను అనుకున్నారాట. కానీ మొదట చేస్తానని చెప్పిన ఉదయ్ ఆ తరువాత ఎందుకో చేయనని షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు చేతులెత్తేసినట్లు చెప్పారు.

అలా తనువు చాలించిన ఉదయ్
ఉదయ్ కిరణ్ మృతిపై ఎన్నో కామెంట్స్ వస్తున్న అసలు వాస్తవం అనేది కొంత అపజయాలు కూడా అతన్ని కొలుకోకుండా చేశాయి. ఒక సినిమాను నిర్మించి కూడా దాదాపు ఏడాది పాటు ఆర్థిక ఇబ్బందులను చూశాడు. ఇక 2012లో పెళ్లి చేసుకున్నప్పటికీ ఒత్తిడి నుంచి కొలుకోలేకపోయిన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు. అతను భౌతికంగా దూరమైనా కూడా అభిమానుల్లో అతని చిరునవ్వు మాత్రం ఇంకా చెరగని ముద్రగానే ఉంది.


Click it and Unblock the Notifications











