ఉదయ్ కిరణ్ దారిలోనే సుశాంత్ సింగ్.. వాటికి తలవంచి మరణం ఒడిలోకి.. కారణాలు అవేనా?

సినీ పరిశ్రమలో తారల జీవితాలు బయట నుంచి చూస్తూ చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్ని రకాల వ్యధలు, మానసిక వేదనలు, ఒత్తిడిలు ఉంటాయనేది ఒక్కసారి వారు చేసుకొనే ఆత్మహత్యలతో బయటి ప్రపంచానికి తెలుస్తుంది. కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు, కార్లు, విలాసవంతమైన భవనాలు లాంటి కలలు ఒక్క ఫ్లాపుతో చెల్లచెదురు అవుతాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో మరోసారి టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చర్చనీయాంశమైంది. మానసిక శాస్త్రవేత్తలు ఇలాంటి మరణాలపై ఏం చెబుతున్నారంటే..

Recommended Video

Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
 ఒత్తిడిని తట్టకోవడంలో వెనుకంజ

ఒత్తిడిని తట్టకోవడంలో వెనుకంజ

ఉదయ్ కిరణ్ విషయానికి వస్తే.. వరుస విజయాలు కెరీర్ ఆరంభంలో రావడంతో కష్టపడకుండానే స్టార్ హోదా వచ్చేసింది. ఆ తర్వాత వరుస అపజయాలు ఎదురుకావడంతో యువ హీరో వాటిని తట్టుకోవడం కష్టమైంది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లడం సంభవించింది. ఆ తర్వాత చేతికి వచ్చిన సినిమా ఆడకపోవడం, సెట్స్‌పైకి వెళ్తాయనుకొన్న ప్రాజెక్టులు ఉన్నట్టుంది ఆగిపోవడంతో ఉదయ్ కిరణ్‌పై ఒత్తిడి పెరగడం జరిగిందని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

 సుశాంత్ సింగ్ విషయంలో అదే

సుశాంత్ సింగ్ విషయంలో అదే

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో ఉదయ్ కిరణ్ ఎదుర్కొన్న విధంగా పరిస్థితులు లేవు. ఎందుకంటే కేదారినాథ్, చిచ్చోర్ లాంటి హిట్లతో మంచి రేంజ్‌లోనే ఉన్నారు. అయితే ఆర్థిక, వృత్తిపరమైన ఒత్తిడి కంటే.. వ్యక్తిగత, ఆఫైర్ల అంశాలే సుశాంత్‌పై ప్రభావం చూపాయనే విషయాన్ని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు.

 సున్నిత మనస్కులే కావడమే

సున్నిత మనస్కులే కావడమే

సుశాంత్, ఉదయ్ కిరణ్ విషయాల్లో ఒక పోలీక కామన్‌గా ఉంది. వీరిద్దరూ కూడా సున్నిత మనస్కులు, మితభాషి. సుశాంత్ తన తల్లి మరణంతో కుంగిపోవడం, ఆ విషాదం ఇప్పటికీ తనతో వెంట ఉంచుకోవడమనేది ఆయన జీవితంపై తీవ్ర ప్రభావమే పడింది. ఇక ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఫ్యామిలీ నుంచి రకరకాల ఒత్తిళ్లు రావడంతో డిప్రెషన్‌కు గురైనట్టు సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

మానసిక ఆరోగ్యంపై అజాగ్రత్తగా

మానసిక ఆరోగ్యంపై అజాగ్రత్తగా

సినీ తారల్లో చాలా మంది తమ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అదే అనేక వైపరిత్యాలకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలోనే మానసిక రుగ్మతక గురైన నటీనటులను గుర్తించాలి. వారికి ఏదో రకమైన అండను అందించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి డిప్రెషన్‌లో ఉన్నవారిని ఒంటరిగా వదిలేయొద్దు. ఉదయ్ కిరణ్, సుశాంత్ విషయంలో ఇదే జరిగింది. ఒంటరితనమే వారి ప్రాణాలను మింగేసిందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

 ఉదయ్ కిరణ్, సుశాంత్ విషయంలో

ఉదయ్ కిరణ్, సుశాంత్ విషయంలో

మానసిక రుగ్మతకు గురైన నటీనటులను ఎలా గుర్తించాలంటే.. నిరాశ, నిస్పృహలతో బిహేవ్ చేయడం, నెగిటివ్ కామెంట్లు చేయడం, భవిష్యత్‌పై విపరీతమైన బెంగ పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి వారిని స్నేహితులు, సన్నిహితులు గుర్తించాలి. వారికి ఉపశమనం కలిగించేలా మాటలు చెబుతూ మానసిక స్థైర్యాన్ని పెంచాలి. ఉదయ్ కిరణ్ తన కెరీర్‌పై బెంగ పెట్టుకోవడమే ఆయన సూసైడ్‌కు ఓ కారణమని చెప్పుకొంటారు. సుశాంత్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగి ఉంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

మానసిక ఒత్తిడికి గురైతే..

మానసిక ఒత్తిడికి గురైతే..


సినీ పరిశ్రమలో ఎవరైనా సరే.. హీరో గానీ, హీరోయిన్లు గానీ, చిన్న నటులైనా గానీ మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు గురైనప్పుడు ఎక్కువగా నిద్రపోవాలి. ప్రొఫెషనల్‌గా కొందరి సహాయాన్ని తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఎక్కువగా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండటానికి ఆసక్తి చూపకూడదు అనే విషయాలను వైద్యులు సూచిస్తున్నారు.

అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలనిపిస్తే..

అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలనిపిస్తే..

ఆర్థిక, మానసిక పరిస్థితులు ప్రభావం చూపినా గానీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనే ప్రయత్నాన్ని మనసులో రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినా దానికి పరిష్కారం వెతుక్కోవాలి గానీ ప్రాణాలు తీసుకోవడం చివరి గమ్యం కాకూడదు. సూసైడ్ ఆలోచనలు వస్తే.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చర్చించాల్సే ప్రయత్నాలు చేయాలి. లేదా మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే మనకు దూరమయ్యారనే విషయాన్ని మానసిక విశ్లేషకుల చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X