ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా చంపేయకండి.. రిలీజ్ చేయడం కష్టమేమి కాదు!

ఒక మనిషి బ్రతికి ఉన్నప్పటి కంటే.. చనిపోయినప్పుడే వారి విలువ ఎక్కువగా తెలుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు మనిషి లోకం విడిచి వెళ్ళేంత వరకు కూడా అర్థం కాదు. ఉదయ్ కిరణ్ లైఫ్ కూడా ఓ విధంగా అలాంటిదే. ఉదయ్ కిరణ్ చివరి సినిమాను రిలీజ్ చేస్తే బావుంటుందనే కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Recommended Video

Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
ఆ రెండు జీవితాలు..

ఆ రెండు జీవితాలు..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనతో మరోసారి ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించిన వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. సుశాంత్, ఉదయ్ కిరణ్ జీవితాలు దాదాపు ఒకే కోణంలో ఉండడం అందరిని ఆశ్చర్యపరిచాయి. చివరికి ఉరి వేసుకునే వరకు ఉదయ్, సుశాంత్ సింగ్ జీవితాలు ఒకేలా ఎండ్ అవ్వడం విషాధకరమనే చెప్పాలి.

టాలీవుడ్ నెపోటీజమ్..

టాలీవుడ్ నెపోటీజమ్..

ఉదయ్ కిరణ్ జీవితం గురించి ఎవరికి తెలియనిది కాదు. అతని మృతికి.. కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడమే కారణమని అందరికి తెలిసిందే. అనుకోని అపజయాలు అవకాశాలు లేకుండా చేశాయి అనే కామెంట్స్ కంటే కూడా అతనికి అవకాశాలు రాకుండా చేశారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటీజమ్ అనే పదం కూడా హాట్ టాపిక్ గా మారింది.

 ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా..

ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కడం అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. 'చిత్రం చెప్పిన కథ' అనే సినిమాలో ఆఖరి సారిగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఉదయ్ ఆత్మహత్య అనంతరం ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు.

కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే..

కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే..

ఆర్థిక కారణాల వల్ల కూడా ఆ సినిమాను రిలీజ్ చేయలేదు అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. కనీసం ఓటీటీలో రిలీజ్ చేస్తే బావుంటుందని ఓ వర్గం అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అటకెక్కిన సినిమాలు చాలా వరకు ఓటీటీలో ఒక మంచి రేటుకు అమ్మేస్తున్నారు.

అలా చంపేయకండి..

అలా చంపేయకండి..

గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ దాదాపు అందరు మర్చిపోయే సమయంలో ఓ వర్గం నెటీజన్స్ కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని కోరడంతో మంచి రేటుకు అమ్మేసి డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఉదయ్ కిరణ్ చివరి సినిమాను కూడా అలా చంపేయకండి అంటూ.. కనీసం ఓటీటీలో అయినా రిలీజ్ చేయాలని ఓ వర్గం ఆడియెన్స్ కోరుతున్నారు. మరి నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X