‘వకీల్ సాబ్’పై వివాదాస్పద క్రిటిక్ రివ్యూ: ఆ సినిమాలకు నాలుగు స్టార్లు.. పవన్ మూవీకి మాత్రం ఇలా!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌తో అనతి కాలంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన మెగా హీరో.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ అంచనాలతో త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాపై దుబాయ్‌కు చెందిన వివాదాస్పద క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా రివ్యూ ఇచ్చాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

పెద్ద సాహసమే చేస్తున్న పవన్ కల్యాణ్

పెద్ద సాహసమే చేస్తున్న పవన్ కల్యాణ్

'అజ్ఞాత‌వాసి' తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. 'వకీల్ సాబ్' అనే మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాధారణంగా రీఎంట్రీ సినిమా అంటే కొత్త కమర్షియల్ కథతో వస్తారు. కానీ, పవన్ మాత్రం అందరికీ తెలిసిన స్టోరీని ఎంపిక చేసుకున్నాడు.

వాళ్ల కోసం లాయర్‌గా మారిపోయాడుగా

వాళ్ల కోసం లాయర్‌గా మారిపోయాడుగా


'వకీల్ సాబ్' మూవీలో వ్యభిచార గృహంలో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. హిందీలో ఈ పాత్రను అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ కుమార్ చేశారు. ఇప్పుడీ పవర్‌ఫుల్ రోల్‌ను పవర్ స్టార్ చేస్తున్నాడు. ఇందులో బాధిత అమ్మాయిలుగా నివేదా థామస్, అంజలి, అనన్య నటిస్తున్నారు. ఇప్పటికే వాళ్ల లుక్స్ కూడా వచ్చాయి.

అంచనాలను పెంచేసిన మూవీ అప్‌డేట్స్

అంచనాలను పెంచేసిన మూవీ అప్‌డేట్స్

పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వీటితో పాటు పవర్ స్టార్ పుట్టినరోజుకు వచ్చిన మోషన్ పోస్టర్‌కు, ఆ తర్వాత వచ్చిన టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

భారీగా బిజినెస్.. పవన్ క్రేజ్‌ అంటే ఇదే

భారీగా బిజినెస్.. పవన్ క్రేజ్‌ అంటే ఇదే

చాలా కాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు పవన్ కల్యాణ్. దీంతో అతడి కమ్‌బ్యాక్ మూవీపైనే అందరి దృష్టి ఉంది. అందుకు అనుగుణంగానే బయ్యర్లు కూడా ఈ మూవీపై బాగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో కలిపి రూ. 100 కోట్లకు పైగా పలుకుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

‘వకీల్ సాబ్’పై వివాదాస్పద క్రిటిక్ రివ్యూ

‘వకీల్ సాబ్’పై వివాదాస్పద క్రిటిక్ రివ్యూ

సినిమాల విడుదలకు ముందే సోషల్ మీడియా ద్వారా చిత్ర విచిత్రమైన రివ్యూలు ఇస్తూ వివాదాస్పద క్రిటిక్‌గా పేరొందాడు దుబాయ్‌కు చెందిన ఉమైర్ సంధు. గతంలో ఎన్నో టాలీవుడ్, బాలీవుడ్ మూవీలపై తన అభిప్రాయాలు చెప్పిన అతడు.. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ ఎవెటెడ్ ఫిల్మ్ 'వకీల్ సాబ్'పై రివ్యూ ఇచ్చాడు. దీంతో అతడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు.

అక్కడ పాస్ అయింది.. వకీల్ సాబ్ అలా

అక్కడ పాస్ అయింది.. వకీల్ సాబ్ అలా

నాలుగు రోజుల క్రితం 'వకీల్ సాబ్' మూవీ సెన్సార్ గురించి ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు. 'వకీల్ సాబ్ సెన్సార్ పూర్తైంది. ఒక్క కట్ కూడా లేదు. బిగ్ హిట్ వస్తుంది' అంటూ అందులో రాసుకొచ్చాడు. ఇక, తాజాగా మరో ట్వీట్ చేస్తూ.. 'వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్స్ అదిరిపోయాయి. సినిమా టెర్రిఫిక్‌గా ఉంది. పవన్ కల్యాణ్ భారీ హిట్‌తో కమ్‌బ్యాక్ అవుతున్నాడు' అని రివ్యూ ఇచ్చేశాడతను.

ఆ సినిమాలకు నాలుగు స్టార్లు.. దీనికేమో

ఆ సినిమాలకు నాలుగు స్టార్లు.. దీనికేమో


గతంలో చాలా తెలుగు సినిమాలకు రిలీజ్‌కు ముందే ఉమైర్ సంధు రివ్యూలు ఇచ్చాడు. మరీ ముఖ్యంగా 'భరత్ అనే నేను', 'రంగస్థలం', 'అరవింద సమేత' వంటి చిత్రాలకు నాలుగు స్టార్లు కూడా ఇచ్చాడు. ఇవి నిజంగానే హిట్ అయ్యాయి. అలాగే, 'స్పైడర్', 'నా పేరు సూర్య'కు కూడా అదే రేటింగ్ ఇచ్చాడు. కానీ, ఇవి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 'వకీల్ సాబ్'కు మాత్రం రేటింగ్ ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X