సర్కార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: బ్లాక్‌బస్టర్.. విజయ్, మురగదాస్ హ్యాట్రిక్

డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, తమిళ సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ నాదే అంటూ వివాదం రేగడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. అనేక వివాదాల నడుమ ఈ చిత్రం నవంబర్ 6న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి రివ్యూను ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు. సర్కార్ సినిమా గురించి ఏం చెప్పారంటే..

పంచ్ డైలాగ్స్‌తో మూవీ

పంచ్ డైలాగ్స్‌తో మూవీ

సర్కార్ సినిమా గురించి చెప్పాలంటే కేవలం విజయ్ మాత్రమే కనిపిస్తాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఫైట్లు చాలానే ఉన్నాయి. స్టోరీ చాలా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. డాన్సులు ఇరుగదీశాడు. పంచ్ డైలాగ్స్‌తో సినిమా హాల్ మార్మోగడం ఖాయం అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

 విజయ్ ఫ్యాన్స్‌కు పండుగలా

విజయ్ ఫ్యాన్స్‌కు పండుగలా

సర్కార్ సినిమా మొత్తం మాస్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాతో నిజమైన దీపావళీగా మారబొతున్నది. విజయ్, మురగదాస్ మరో బ్లాక్ బస్టర్ అందించబోతున్నారు. ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అని పేర్కొన్నారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా

అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రూపొందించిన చిత్రం సర్కార్. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంటుంది. ఏఆర్ మురుగదాస్, విజయ్‌ కాంబినేషన్‌కు హ్యాట్రిక్ విజయం.

యూఎస్ ప్రీమియర్ల స్పందన

యూఎస్ ప్రీమియర్ల స్పందన

ఓవర్సీస్ మార్కెట్‌లో సర్కార్ భారీగా రిలీజైంది. యూఎస్ ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. విజయ్ కెరీర్‌లోనే సర్కార్ చిత్రం అతిపెద్ద ఒపెనింగ్‌గా మారింది. ఈ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అంటూ ఉమేర్ సంధూ వరుస ట్వీట్లు చేశారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితం ఆధారంగా సర్కార్ చిత్రం తెరకెక్కిందనే మాట వినిపిస్తున్నది. విజయ్ పోషించిన పాత్రకు పిచయ్ స్ఫూర్తి. సర్కార్ చిత్రంలో విజయ్ అమెరికాలో నివసించే ఎన్నారైగా నటించాడు. అమెరికా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు అనేది సర్కార్ సినిమా కథ.

తమిళనాడు పాలిటిక్స్‌లో

తమిళనాడు పాలిటిక్స్‌లో

ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను సినిమాల్లో చూపించినట్టు సమాచారం. సర్కార్ క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనేక ట్విస్టులు, మలుపులు ఉంటాయి. ప్రేక్షకుడిని సీట్లకు హత్తుకుపోయి చేసేలా ఉంటుందనే సినీ వర్గాల టాక్.

విజయ్, మురుగదాస్ మూడోసారి

విజయ్, మురుగదాస్ మూడోసారి

కత్తి, తుపాకి చిత్రాల తర్వాత విజయ్‌తో మురగదాస్ తీస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా నటించారు. కీర్తీ సురేష్ గ్లామర్ పాత్రలో విజయ్ సరసన కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X