మహేష్ బాబు - అల్లు అర్జున్.. రిజెక్ట్ చేసిన కథలతోనే రిస్క్ చేస్తున్నారు!

ఒక కథ తెరపైకి వచ్చే ముందు ఎంత మంది హీరోల దగ్గరకు వెళ్లి వస్తుందో ఎవరికి తెలియదు. కొందరు చాలా వరకు అలాంటి విషయాలని బయటపెట్టరు. ప్రస్తుత రోజుల్లో మాత్రం సోషల్ మీడియా కారణంగా అలాంటి ఇన్సిడెంట్స్ గురించి తొందరగానే తెలిసిపోతోంది. ఇక ప్రస్తుతం బన్నీ, మహేష్ బాబు లకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఆ కథని ఇంతకుముందే..

ఆ కథని ఇంతకుముందే..

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు ఆ సినిమా కోసం ఒక కొత్త లుక్ రెడీ చేసుకున్నాడు. దర్శకుడు పరశురామ్ మహేష్ క్రేజ్ కి తగ్గట్లుగా కథను రీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పరశురామ్ చెప్పిన ఆ కథని ఇంతకుముందే చాలా మంది రిజెక్ట్ చేశారట.

రిజెక్ట్ చేసిన వారిలో..

రిజెక్ట్ చేసిన వారిలో..

'సర్కారు వారి పాట' కథను రిజెక్ట్ చేసిన వారిలో అల్లు అర్జున్ కూడా ఒకడు. గీత గోవిందం సక్సెస్ అనంతరం దర్శకుడు పరశురామ్ గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే మరొక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అందులో నిర్మాతలు కథపై సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టును బన్నీ ఒకే చేయలేకపోయాడట. దీంతో దర్శకుడు మహేష్ ని సంప్రదించాడు.

పుష్ప సినిమాను కూడా..

పుష్ప సినిమాను కూడా..

ఇక ఇదే తరహాలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాను కూడా మహేష్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. మొదట దర్శకుడు సుకుమార్ మహేష్ కోసం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది. కానీ మహేష్ సుకుమార్ రాసుకున్న కథలో చాలా మార్పులు చేయాలని సూచించాడు.

Recommended Video

Ramuloo Ramulaa Dance By Suma Kanakala, Video Viral
సుకుమార్ కాస్త హార్ట్ అయ్యాడని..

సుకుమార్ కాస్త హార్ట్ అయ్యాడని..

మహేష్ బాబుని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు సుకుమార్ కూడా కథలో ఎన్నో మార్పులు చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్టవ్వలేదు. మహేష్ చాలా రోజుల పాటు తిప్పించుకోవడంతో సుకుమార్ కాస్త హార్ట్ అయ్యాడని కూడా టాక్ వచ్చింది. ఇక మొత్తానికి అదే కథను పుష్ప గా డిజైన్ చేసిన సుకుమార్ బన్నీతో చేయడానికీ సిద్ధమయ్యాడు. ఈ విధంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథలు అనుకోకుండా ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గరకు వెళ్లడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X