twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthik: భార్య సోదరితో పెళ్లి, చెడు అలవాట్లు, కష్టాల కడలితో స్టార్​ హీరో జీవితం..

    |

    సీతాకోక చిలుక వంటి క్లాసిక్​ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్​ సీనియర్​ హీరో, నటుడు కార్తిక్. ఆయనదైన నటనా శైలితో ఇటు తమిళ్, అటు తెలుగు ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాడు. రెండు భాషల్లో కలుపుకుని సుమారు 125కిపైగా సినిమాలో నటించిన కార్తిక్​ ప్రస్తుతం సెకండ్​ ఇన్నింగ్స్​తో ముందుకు వెళ్తున్నాడు. ఈ సెకండ్​ ఇన్నింగ్స్​లో విలన్​గా రాణిస్తూ అలరిస్తున్నాడు. అయితే కార్తిక్​ తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. రాజకీయాల్లో రాని సక్సెస్​, ఆర్థిక సమస్యలు, చెడు అలవాట్లు తదితర సమస్యల్లో చిక్కున్న కార్తిక్ జీవిత విషయాల్లోకి​ వెళితే..

    సీతాకోక చిలుక సినిమా తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్​ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు నందమూరి కల్యాణ్ రామ్​ ఓమ్​ 3డి సినిమాలో తండ్రిగా, విలన్​గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సీనియర్​ హీరో కార్తిక్.

    కార్తిక్​ అసలు పేరు..

    కార్తిక్​ అసలు పేరు..

    అయితే ప్రముఖ నటుడు ఆర్​ ముత్తు రామన్​ కుమారుడైన కార్తిక్ అసలు పేరు మురళీ కార్తికేయ ముత్తురామన్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక కార్తిక్​గా మార్చుకున్నాడు. తొలిసారిగా 1981లో విడుదలైన భారతీరాజా చిత్రం ఓవాతిల్లై అనే తమిళ సినిమా ద్వారా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

    నరస నాయకన్​గా గుర్తింపు..

    నరస నాయకన్​గా గుర్తింపు..

    అనంతరం ఎన్నో తమిళ, తెలుగు హిట్​ సినిమాల్లో హీరోగా అదరగొట్టాడు. అన్ని రకాల భావోద్వేగాలు పండించడంలో దిట్ట. దీంతో నరస నాయకన్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అన్ని భాషల్లో కలిపి 125 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. తమిళ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అవార్డులతో పాటు నంది అవార్డును సైతం అందుకున్నాడు.

     సహనటి రాగిణితో పెళ్లి..

    సహనటి రాగిణితో పెళ్లి..

    ఇక 1988లో సహనటి అయినటువంటి రాగిణిని పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. వీరిద్దరు సోలైకుయిల్​ అనే తమిళ చిత్రంతో పరిచయమయ్యారు. ఈ దంపతులకు గౌతమ్ కార్తిక్, ఘైన్​ కార్తిక్​ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కడలి సినిమా ద్వారా గౌతమ్​ కార్తిక్​ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    అప్పటి నుంచి కష్టాలు..

    అప్పటి నుంచి కష్టాలు..

    ఆ తర్వాత 1992లో రాగిణి సోదరి రథిని రెండో వివాహం చేసుకున్నాడు కార్తిక్. వీరిద్దరికి తిరన్​ కార్తిక్​ అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తిక్​ జీవితం 2000 సంతవ్సరం నుంచి కష్టాలు చవిచూశాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.

    చెడు అలవాట్లతోనేనా?..

    చెడు అలవాట్లతోనేనా?..

    2005లో వచ్చిన ప్రముఖ నటుడు సత్యరాజ్​ శివలింగం ఐపీఎస్​ చిత్రంలో మొదటిసారిగా విలన్​ పాత్రలో నటించాడు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ మూవీ పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్​ నాశనం అయిందని పలు సందర్భాల్లో కార్తిక్ తానే స్వయంగా తెలిపాడు.

    రాజకీయ జీవితం..

    రాజకీయ జీవితం..

    తర్వాత సినిమాలకు బ్రేక్​ ఇచ్చి 2006లో తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశాడు కార్తిక్. ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీలో చేరాడు. అనంతరం తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా నియమితుడయ్యాడు. పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓటమి పాలయ్యింది.

    సొంతంగా పార్టీ స్థాపన..

    సొంతంగా పార్టీ స్థాపన..

    ఈ పరాజయం తర్వాత 2009 లోక్​ సభ ఎన్నికలకు ముందు కార్తిక్​ సొంతంగా అహిళ ఇండియా నాదలుమ్​ మక్కల్​ కట్చి పేరుతో పార్టీ స్థాపించాడు. ఈ ఎన్నికల్లో విరుదునగర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. కార్తిక్​కు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుని, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సెకండ్​ ఇన్నింగ్స్​లో వరుస సినిమాలు చేస్తూ కార్తిక్​ బిజీగా ఉన్నాడు.

    English summary
    Senior Actor Karthik Has Second marriage With His Wife Ragini Sister Rathi. He Faced So Many Difficulties With His Bad Habits. And His Political Career Also Not Successful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X