సమంతకు మరో పేరు.. అదే టైటిల్‌గా హిట్టు మూవీ.. సినిమాల్లోకి రాకముందు సామ్ జాబ్ ఇదే!

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకుంది ముద్దుగుమ్మ సమంత. సినీ కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలతో అట్రాక్ట్ చేసిన ఈ చిన్నది ప్రస్తుత కాలంలో లేడీ ఒరియెంటెడ్ చిత్రాలకు మొగ్గు చూపుతుంది. అందులో భాగంగానే ఇటీవల రిలైజన శాకుంతలం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే సమంతకు ఇదే అసలు పేరు అనుకుంటారు. కానీ ఆమెకు మరో పేరు ఉంది. అలాగే సమంత సినిమాల్లోకి రాకముందు ఏం జాబ్ చేసేది అనే తదితర ఆసక్తికర విషయాల్లోకి ఆమె పుట్టినరోజు (HBD Samantha) సందర్భంగా (ఏప్రిల్ 28) వెళితే..

Unknown Interesting Facts About Samantha Over Her Birthday Special

తీవ్రమైన నెగెటివిటీ: యాపిల్ బ్యూటి సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్, బీజీఎమ్, టేకింగ్ తదితర అంశాలపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చిన విషయం తెలిసిందే.

Unknown Interesting Facts About Samantha Over Her Birthday Special

రెండు ఎపిసోడ్స్: ఇక శాకుంతలం సినిమా సంగతి ఎలా ఉన్నా సమంతకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటించేందుకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత యాక్ట్ చేస్తోంది. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్ తో మొదటగా విడుదలైంది.

Unknown Interesting Facts About Samantha Over Her Birthday Special

రెమ్యునరేషన్ ఎక్కువగా: ఇదిలా ఉంటే ఇవాళ అంటే ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు (Samantha Birthday). 36వ వసంతంలోకి వెళ్తున్న సందర్భంగా సమంతకు సంబంధించిన ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం. నిజానికి సమంత ముందుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనుకుంటారు. కానీ దానికంటే ముందుగా నిన్ను కలిశాక అనే సినిమాకు ఆడిషన్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో మేకర్స్ వద్దనుకున్నారు.

Unknown Interesting Facts About Samantha Over Her Birthday Special

రాహుల్ హీరోగా: నిన్ను కలిశాక సినిమా కంటే ముందుగానే రవి వర్మన్ దర్శకత్వం వహించిన మాస్కోవిన్ కావేరి చిత్రంలో నటించి ముద్దుగుమ్మ సమంత. అయితే ఈ సినిమా ఏ మాయ చేశావే రిలీజ్ తర్వాత 2010 ఆగస్టు 27న విడుదలైంది. ఇందులో సమంత బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాద భర్త, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు.

సాంప్రదాయ దుస్తులతో: సమంతకు యశోద అనే మరో కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆమెను ఆ పేరుతో పిలుస్తారట. ఇక యశోద టైటిల్ తో విడుదలైన మూవీ మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలోకి రాకముందు బ్యూటిఫుల్ సమంత వెల్‌కమ్ గర్ల్ గా పనిచేసేది. పార్టీలు, ఈవెంట్స్ లలో సాంప్రదాయ దుస్తులు ధరించి అతిథులకు స్వాగతం పలికేది.

Unknown Interesting Facts About Samantha Over Her Birthday Special

జపనీస్ వంటలు: సమంత పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం పనిచేసే ప్రత్యూష సపోర్ట్ అనే ఎన్జీవోను నడుపుతున్న విషయం తెలిసిందే. 2013లో తనకు డయాబెటిసీ ఉన్నట్లు సమంత వెల్లడించింది. కఠినమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడింది. ఇక సౌత్ ఇండియన్ అయిన సామ్ కి జపనీస్ వంటకాలు అంటే ఎంతో ఇష్టం. సుషీ అనే జపనీస్ వెరైటీని చాలా ఇష్టంగా తింటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X