రామ్ చరణ్ 11 ఇయర్స్ జర్నీపై ఉపాసన ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చిన 11 సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. చరణ్ నటించిన 'చిరుత' విడుదలై పదకొండేల్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో తన భర్తను విష్ చేస్తూ ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరిన్ని సక్సెస్‌లు అందుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

''మిస్టర్ సి మై లవ్.... నువ్వు ఎంతగానో ఇష్టపడే నీ వృత్తిలో విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు. ఈ పదకొండేళ్ల కాలంలో ఎంతో ఫేమ్, సక్సెస్ అందుకోవడంతో పాటు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూశావు. వీటిని నువ్వు హ్యాండిల్ చేసిన తీరు నాకు ఎంతగానో నచ్చింది. నీ ప్రేమ, బలం అనే గొడుకు కింద ఆశ్రయం తీసుకోవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తర్వాత వచ్చే 11 సంవత్సరాలు నీతో కలిసి ప్రయాణించబోతున్నందుకకు ఆనందంగా ఉంది.'' అని ఉపాసన ట్వీట్ చేశారు.

ఈ పదకొండేళ్ల కాలంలో రామ్ చరణ్ 11 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తన 12వ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ యూరఫ్‌లోని అజ‌ర్‌బైజాన్‌ అనే ప్రాంతంలో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Upasana interesting tweet about Ram charan 11 years movie journey

రామ్‌చరణ్‌, కియ‌రా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X