మానవత్వం చాటుకొన్న ఉపాసన కొణిదెల.. సొంత ఊరు, మహిళల కోసం ఏం దానం చేశారంటే?
పారిశ్రామికవేత్త, స్వచ్చంద సేవకురాలు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదల ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు, మహిళల కోసం ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని టాటా హౌస్‌లో జోయా కొత్త స్టోరును ప్రారంభించారు. విలాసవంతమైన, అరుదైన జ్యూవెల్లరీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జోయా స్టోర్‌ను ప్రారంభించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఉపాసన తన మానవత్వాన్ని చాటుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఉపాసనకు తన పూర్వీకుల గ్రామం దోమకొండ ఖిలా అంటే చాలా ఇష్టం. దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ ట్రస్ట్‌కు భూరీ విరాళాన్ని అందజేశారు. స్టోర్ ప్రారంభానికి ఇచ్చే పారితోషికాన్ని తమ ఊరు అభివృద్ది కోసం డొనేట్ చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడం, వారి సంక్షేమానికి, మహిళల్లో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.

జోయా స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని టాటా హౌస్‌లో జోయా కొత్త స్టోరును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్‌లో రేర్, విలువైన జ్యూవెల్లరీ లభిస్తుంది. మహిళా సంక్షేమం, అభివృద్ది కోసం దోమకొండ ఫోర్ట్ ట్రస్ట్ కార్యక్రమాలను సపోర్ట్‌గా నిలుస్తున్నదుందుకు స్పెషల్ థ్యాంక్స్ అని అన్నారు.
ఉపాసన గత కొద్దికాలంగా కేవలం దోమకొండ గ్రామ మహిళలకే కాకుండా ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలకు సహాయం అందిస్తున్నారు. ఎన్నోసార్లు బాధితులకు ఆపన్నహస్తం అందించి తనలోని మానవత్వాన్ని చాటుకొన్నారు.
ఇదిలా ఉండగా, రాంచరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ దంపతులు జూలై చివరి మాసంలో గానీ, ఆగస్టులో గానీ తమ తొలి సంతానాన్ని మెగా ఫ్యామిలీకి అందించనున్నారు. తమ ఇంటిలోకి చిన్నారి రాకకోసం చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.


Click it and Unblock the Notifications











