రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొత్త అవతారం... సమంతతో కలిసి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం!

రామ్ చరణ్ భార్య ఉపాసన లుక్ పరంగా ఎంత మారిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సమయంలో కాస్త బొద్దుగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొన్న ఆమె దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టారు. బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యారు. అంతటితో ఊరుకోకుండా అపోలో లైఫ్ ద్వారా ఫిట్ నెస్, హెల్తీ ఫుడ్ విషయంలో అందరినీ చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అపోలో డైరెక్టర్‌గా తన బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అపోలో లైఫ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ గురించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాసన యాంకర్ అవతారంఎత్తి హీరోయిన్ సమంతను ఇంటర్వ్యూ చేశారు.

ఇక నుంచి ఉపాసన ఇంటర్యూలు కూడా

ఇక నుంచి ఉపాసన ఇంటర్యూలు కూడా

ఫిట్ నెస్ గురించి అంశాలపై ఉాపాసన పలువురు సెలబ్రిటీలతో వరుస ఇంటర్వ్యూలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి ఇంటర్వ్యూ సమంతతో నిర్వహించాురు. ఇందుకు సంబంధించిన టీజర్ ఆమె ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో ఉపాసన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

అందుకే తొలి ప్రయత్నంలో సమంత

తొలి ఇంటర్వ్యూకు సమంతను ఎంచుకోవడానికి గల కారణంపై ఉపాసన స్పందిస్తూ... ‘నాకు ఇలాంటివి చాలా కొత్త. సమంత నాకు చాలా సన్నిహితురాలు. ఆమె అయితే నేను రిలాక్స్‌గా చేయగలను' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సమంత నుంచి ఆమె పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

సామ్, చై, నాగార్జున ఈ ముగ్గురిలో...

సామ్, చై, నాగార్జున ఈ ముగ్గురిలో...

ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు. సమంత, చైతన్య, నాగార్జునలో ఎవరు ఎక్కువ ఫిట్‌గా ఉన్నారు అని అడగ్గా... చాలా మంది అభిమానులు కింగ్ నాగార్జున అంటూ సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ టీజర్ ఆసక్తికరంగా ఉందని, పూర్తి వీడియో కోసం ఎదురు చూస్తున్నామని, వీలైనం త్వరగా దాన్ని విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

ఉపాసన కామినేని కొణిదెల

ఉపాసన కామినేని కొణిదెల

రామ్ చరణ్‌ వైఫ్ ఉపాసన మెగా ఫ్యామిలీ కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.... మెగా ఇమేజ్‌తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటు కుటుంబం, అటు అపోలో బాధ్యతలు, వ్యాపార పరమైన మీటింగులు, సెమినార్లలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా తన భర్తతో కలిసి సినిమా సెట్లలో సందడి చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X