మగవారందరికీ అంకితం.. ఉపాసన కామెంట్స్ వైరల్
ఉపాసన కొణిదెల మెగా ఫ్యామిలీ కోడలిగా ఎంతటి బాధ్యతలు నిర్వర్తిస్తుందో.. అపోలో హాస్పిటల్ బాధ్యతలను కూడా అంతే స్థాయిలో మోస్తుంటుంది. మహిళా వ్యాపారవేత్తగా ఉపసాన ఎన్నో అవార్డులు రివార్డులను అందుకుంది. ఇక సామాజిక సేవల్లోనూ ఉపాసన ముందుంటుంది. మూగజీవాల సంరక్షణ, ఆరోగ్య చిట్కాలు వంటి వాటి గురించి చెబుతూ అందరికీ అవగాహన కల్పిస్తుంటుంది.
అలాంటి ఉపాసనకు తాజాగా ఓ అవార్డు వచ్చింది. దానిని మగవారందరికీ అంకితం చేసింది. మహిళా వ్యాపారవేత్తల్లో అత్యంత ప్రభావ శీలురైన జాబితాలో ఉపాసన పేరు వచ్చింది. ఈ మేరకు ఆమెను ఫిక్కి ఫ్లో ఇన్ఫ్లూయేన్షియల్ ఉమెన్స్ అవార్డ్స్ సంస్థ సత్కరించింది. ఈ మేరకు ఉసాసన తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరిచింది. ఆ అవార్డును మహిళలకు తోడ్పాటుగా ఉండే పురుషులకు అంకితమని తెలిపింది.

ఈ మేరకు ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఎవరైనా తన భార్యను, తల్లి, చెల్లిని, కూతురు, కోడళ్లు, మనవరాళ్లను ఎదిగేలా చేస్తారో.. సాయపడతారో.. ప్రోత్సహిస్తారో అలాంటి మగవారికి ఈ అవార్డును అంకితం చేస్తాను. మహిళల కోసం పాటు పడే మగవారుంటే ఎంతో జాగ్రత్త, పాజిటివ్ ఉన్నట్టు.. విజయం వరించినట్టు అనిపిస్తుంటుందని ఉపాసన చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











