ప్రపంచాన్ని చూసే విధానంలో మార్పు వచ్చింది.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్
మెగా కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా, అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నిర్వర్తించే మహిళామణిగా ఉపాసనకు మంచి పేరు ఉంది. సోషల్ మీడియాలో ఉపాసనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఉపాసనను ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా సమజానికి ఉపయోగపడే పనులు, ఆరోగ్య చిట్కాలు, సంప్రదాయ పద్దతులను ఉపాసన ప్రమోట్ చేస్తూ ఉంటుంది.
మామూలుగా స్టార్ హీరోలు, హీరోయిన్ల బర్త్ డేలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. కానీ నిన్న (జూన్ 20) ఉపాసన బర్త్ డే విపరీతంగా హల్చల్ చేసింది. సానియా మీర్జా చేతుల మీదుగా బర్త్ డే కామన్ డీపీని రిలీజ్ చేయించారు. కామన్ డీపీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇక పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీ నుంచే కాకుండా వ్యాపారం రంగంలోంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తాజాగా ఉపాసన తనపై కురిపించిన ప్రేమకు ప్రతిగా ఓ పోస్ట్ చేసింది. 'నాకు బర్త్ డే విషెస్ చెప్పినందుకు, అనంతమైన ప్రేమను కురిపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మీరంతా కలిసి నా పుట్టిన రోజును ఎంతో ప్రత్యేకంగా నిలిచేలా చేశారు. మనం ప్రపంచాన్ని చూసే కోణాన్ని ఈ కరోనా మార్చేసింది. ప్రేమ, నిజాయితీ, దయాగుణం వల్లే మనమంతా కోలుకుంటామ'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











