పేడ ఎత్తిన మెగా కోడలు.. ఉపాసన ఫోటోలు వైరల్
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కోడలిగా కుటుంబ బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు అపోలో హాస్పిటల్‌లో అత్యున్నత పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇవేకాక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటుంది. ఆయుర్వేద పద్దతుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో వివరిస్తూ ఉంటుంది. నేటి తరం మహిళలకు ఆదర్శకంగా నిలుస్తూ అందరి మన్నలను అందుకుంటోంది ఉపాసన.
కుటుంబ విషయాలు, వత్తిపరమైన విషయాలు, భర్త రామ్ చరణ్ గురించిన అప్‌డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన.. నెటిజన్లతో ముచ్చటిస్తూ ఉంటుంది. సమాజంలోని సమస్యలపైనా స్పందిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదకుంటుంది.

సీసీసీ కార్యక్రమంలో భాగంగా అందరికీ అపోలో తరుపున సినీ కార్మికులకు ఉచిత మందులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాసన ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. గ్రామీణ వాతావరణంలో ఉంటూ.. ప్రకృతి ఒడిలో సేద తీరుతోంది. ప్రస్తుతం వ్యవసాయం సంబంధిత పనులను చేసుకుంటూ హాయిగా సమయాన్ని గడుపుతోంది.

ఈ మేరకు ఉపాసన ఓ పోస్ట్ చేసింది. డాడీతో కలిసి పేడ ఎత్తుతున్న అమ్మాయి.. మోడ్రన్ డే రైతు.. సేంద్రియ వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నాను..కంపోస్టింగ్, వ్యర్థ ఆహార పదార్థాలను ఎలా వాడుకోవాలో, ఎలా తగ్గించాలో తెలుసుకుంటున్నాను. సుస్థిరమైన ఈ జీవనశైలి ఎంతో సౌదర్యంగా ఉందని, పేడను ఎత్తిన ఫోటోలను, ఆవు దూడలకు దాన పెడుతున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై మహేష్ బాబు సతీమణి నమ్రత స్పందిస్తూ.. మంచి అమ్మాయని కితాబిచ్చింది.


Click it and Unblock the Notifications











