సైరాలో నటనకు మెచ్చి.. తమన్నాకు ఉపాసన సూపర్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే!
ఎన్నో ఏళ్లుగా దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమలో గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్న తమన్నా భాటియా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. మిల్కీ బ్యూటీ కాస్త సైరా తర్వాత ఫెర్ఫార్మర్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అక్టోబర్ 2వ తేదీన రిలీజైన మెగాస్టార్ చిరంజీవితో తమన్నా నటించి మెప్పించింది. ఈ క్రమంలో అందరి ప్రశంసలతోపాటు తన స్నేహితురాలు, రాంచరణ్ సతీమణి ఉపాసన ఓ అరుదైన బహుమానాన్ని అందజేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

బాహుబలిలో కత్తిపట్టి
బాహుబలి సినిమాలో కత్తిపట్టి వీరనారిగా ప్రేక్షకులను ఆలరించిన తమన్నా భాటియా ఇప్పుడు సైరాతో క్రిటిక్స్ ప్రశంసలు అందుకొంటున్నది. తాజాగా రిలీజైన సైరాలో చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ తర్వాత తమన్నా పోషించిన లక్ష్మీ పాత్ర అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. ఏకంగా థ్యాంక్యూ మీట్‌లో చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు.

సైరాలో ఉద్యమకారిణిగా
ఇక సైరా చిత్రంలో లక్ష్మీ అనే నృత్యకారిణిగా తమన్నా నటించింది. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి ప్రేమలో పడిన లక్ష్మీ పాత్ర కొన్ని పరిస్థితుల కారణంగా దూరమవుతుంది. అలా ప్రేమలో భగ్నమైన లక్ష్మీ చివరకు స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేస్తుంది. ఈ పాత్రలో తమన్నా తన నటనతో మెరుపులు మెరిపించింది.

ఉపాసన వజ్రపు ఉంగరం
తమన్నా చూపిన ప్రతిభకు రాంచరణ్ భార్య ఉపాసన ఇంప్రెస్ అయి.. పెద్దసైజులో ఉన్న వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ ఉంగరాన్ని ధరించి ఆనందంలో మునిగిపోయిన మిల్కీ బ్యూటీ ఫోటోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తమన్నాకు మిస్టర్ ప్రొడ్యూసర్ నుంచి సూపర్ గిప్ట్. సైరా తర్వాత నిన్ను కలువలేకపోతున్నాను. త్వరలోనే నిన్ను కలుస్తాను అని ఉపాసన వెల్లడించింది.
Recommended Video

రాంచరణ్, సురేందర్ రెడ్డితో
హీరోగా రాంచరణ్ నటించిన రచ్చ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమన్నా, ఉపాసన మధ్య మంచి రిలేషన్ ఉంది. అలాగే సైరా నర్సింహారెడ్డితో మరోసారి దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి పనిచేసింది. గతంలో ఉసరవెల్లి చిత్రంలో తమన్నాకు ఓ మంచి పాత్రను ఆఫర్ చేసిన సురేందర్ రెడ్డి.. సైరాలోను ఆమె టాలెంట్‌ను వెలికితీయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











