twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపాసన ఇంట్లో విషాదం.. అంతిమ యాత్రను ప్రశాంతంగా చేయనివ్వండన్న మెగా కోడలు

    |

    ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు బుధవారం కన్నుమూశారు. ఈ మేరకు మెగా కోడలు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. తాత గురించి, తాతతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్న ఉపాసన.. సేంద్రియ వ్యవసాయం, వ్యర్థ పదార్థాలతో అద్భుతాలను సృష్టించడం వంటి వాటి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తన తాతయ్య గురించి చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    Recommended Video

    Upasana Konidela Grandfather Kamineni Umapathy Rao Is No More
    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటుంది. ఆయుర్వేద పద్దతుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలో వివరిస్తూ ఉంటుంది. నేటి తరం మహిళలకు ఆదర్శకంగా నిలుస్తూ అందరి మన్నలను అందుకుంటోంది ఉపాసన.

     ఆర్గానిక్ ఫార్మింగ్..

    ఆర్గానిక్ ఫార్మింగ్..

    రీసెంట్‌గా లాక్ డౌన్ సమయంలో తండ్రితో కలిసి సేంద్రియ వ్యవసాయాన్ని చేసింది ఉపాసన. ఈ మేరకు పేడను ఎత్తడం, ఆవులకు దాన వేయడం లాంటివి చేసింది. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తాజాగా తాత మరణంతో అందరికీ విజ్ఞప్తి చేసింది. అదేంటో ఓ సారి చూద్దాం.

    ఎన్నో ఘటనలకు సాక్షి..

    ఎన్నో ఘటనలకు సాక్షి..

    ఉపాసన తన తాత గురించి చెబుతూ.. ‘దోమకొండ సంస్థాన్ నుంచి ఐఏఎస్ అయిన ఉమాపతి రావు కాల పరిమితి(15 జూన్ 1928 నుండి 27 మే 2020). రజాకర్ ఉద్యమం, భారతదేశం స్వేచ్ఛ కోసం పోరాటం, మరెన్నో చారిత్రక సంఘటనలను ప్రత్యక్ష సాక్షి. ఒక ఉర్దూ కవిగా తన షాయారీ గురించి అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంమొదటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దయ, మతంపై అత్యంత విశ్వాస్వం గల వ్యక్తి. గొప్ప నియమాలు, నిస్వార్థత, ఔదార్యం & హాస్యచతురత కలిగిన వ్యక్తి.

    అంతిమ యాత్ర..

    అంతిమ యాత్ర..

    అతనిది ఓ గొప్ప సుదీర్ఘ జీవితం. ఆయన సాధించిన విజయాలు, ఆయన దయాగుణం అందరూ గుర్తుంచుకురంటారు. మీ అందరూ ఆయనపై ఉన్న ప్రేమను కన్నీరుతో కాకుండా చిరునవ్వతో చూపించండి. ఇదే మా వినయపూర్వకమైన అభ్యర్థన. అంతిమ యాత్ర ప్రశాంతంగా చేయించడానికి మాకు బలాన్ని ఇవ్వండి. అనుష్పాల, పువాన్ష్, రామ్ చరణ్ & ఉపాసన, సతీజిత్, అగాజా & దిమిత్రి అందరి తరుపున ధన్యవాదాల'ని తెలిపింది.

    English summary
    Upasana Konidela Grand Father Kamineni Umapathy Rao Passed Away. Umapathy Rao of The Erstwhile Samasthan of Domakonda - IAS 15th June 1928 to 27th May 2020. witnessed the struggle of Razakar movement, India’s fight for freedom & many more historic events.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X