అందరిలానే మా మధ్య ఫైటింగ్స్.. చరణ్ ఇచ్చిన అరుదైన గిఫ్ట్ అదే.. వాలంటైన్ రోజున ఉపాసన
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటి ప్రపంచం కోసం వారు తమ ప్రేమను వ్యక్తం చేస్తూ నటించినట్టు కనిపించారు. తమ మధ్య ఉన్న బంధాన్ని ఒకరికొకరు గౌరవించుకొంటారు. వ్యాపారాలు ఉపాసన, షూటింగులతో రాంచరణ్ బిజీగా ఉన్నా వారిద్దరూ వాలంటైన్ రోజున అద్భుతమైన మూమెంట్స్‌ను ఆస్వాదిస్తారు. అలాంటి విషయాలను ఉపాసన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో వెల్లడిస్తూ...

వాలంటైన్ డే రోజున ఏం చేస్తామంటే
ప్రతీ వాలంటైన్ డేను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొంటాం. ఈ సారి వాలంటైన్ డే ఆదివారం రావడంతో ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది. మేమిద్దరం కూర్చొని చాలా మాట్లాడుకొంటాం. కలిసి టీవీ షోలు చూస్తాం. మాకు ఇష్టమైన పనులన్నీ కలిసి చేసుకొంటాం. సోమవారం చరణ్ షూటింగ్‌కు వెళ్తుండటంతో ఆదివారం ఎక్కువ సమయాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకొన్నాం అని ఉపాసన తెలిపారు.

రాంచరణ్‌తో కలిసి రివ్యూలు
ప్రతీ వాలంటైన్ రోజున మా జీవితానికి సంబంధించిన విషయాలను చర్చించుకొంటాం. లైఫ్‌లో మేము నిర్దేశించుకొన్న లక్ష్యాలను ఓ సారి రివ్యూ చేసుకొంటాం. ఆ సమీక్షలకు వాలంటైన్ డేను ఉపయోగించుకొంటాం. చెర్రీకి, నాకు మా జీవిత లక్ష్యాలను పున:సమీక్షించుకోవడానికి ఇలాంటి ప్రత్యేకమైన రోజును వేదికగా చేసుకొంటాం అని ఉపాసన చెప్పారు.

మధురమైన సంఘటనలను గుర్తు చేసుకొని
వాలంటైన్ డే రోజున చరణ్ నాకు చాలా బహుమతులు ఇచ్చారు. వాటి కంటే మేము ఇద్దరం కలిసి మా జీవితంలోని మధురమైన సంఘటనలను, ఈవెంట్లను గుర్తు చేసుకొని సంతోషంలో మునిగిపోతాం. బహుమతుల కంటే నాకు మెమొరీస్ చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి ఉపాసన చెప్పారు.

హార్ట్ ఆకారంలో ఉండే చెవి రింగులు
వాలంటైన్స్ సందర్భంగా చరణ్ ఇచ్చిన గిప్టుల్లో బాగా గుర్తుండిపోయేది ఒకటి ఉంది. మా పెళ్లి తర్వాత నా ఫ్రెండ్ దియాతో మాట్లాడి నా ఇష్టాఇష్టాలను తెలుసుకొన్నాడు. హృదయం ఆకారంలో ఉండే చెవి రింగులను బహుకరించాడు. ముంబైలో షూటింగ్ చేస్తుండగా నేను కలిస్తే.. అప్పుడు కార్‌వాన్‌లో విలువైన జ్యువెల్లరీ గిఫ్టును ఇచ్చారు. దాదాపు ప్రతీ రోజు వాటిని నేను పెట్టుకొంటాను అని ఉపాసన తెలిపారు.
Recommended Video

అందరిలానే పోట్లాడుకొంటాం
దాంపత్య జీవితంలో అందరి మాదిరిగానే మేము పోట్లాడుకొంటాం. వాదనకు దిగుతాం. వైవాహిక జీవితంలో అలాంటి సంఘటనలు ఆరోగ్యకరమైనవని భావిస్తాం. గొడవ జరిగినప్పుడు మా మధ్య ఉండే పరిస్థితిని మాటల్లో చెప్పలేం. జీవితంలో అప్స్ అండ్ డౌన్స్‌ను గౌరవిస్తాం అని ఉపాసన చెప్పారు.


Click it and Unblock the Notifications











