చెర్రీ కోసం అడవుల బాట పట్టిన ఉపాసన.. మెగా కోడలి పిక్స్ వైరల్
ప్రస్తుతం రామ్ చరణ్ ఎక్కడున్నాడో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ, మరో వైపు ఆచార్య మూవీ షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఇప్పుడు అయితే చెర్రీ ఆచార్య షూటింగ్‌లో చిరంజీవితో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరూ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌లు కానిచ్చేస్తున్నారు.

ఆ లొకేషన్..
బన్నీ సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప సినిమా కోసం మారెడు మిల్లీ అటవీప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ పుష్ప షూటింగ్ చేసుకుని వెళ్లిపోయింది. కానీ మిగతా మేకర్స్ మాత్రం మారెడు మిల్లిని పట్టేసుకున్నారు. రంపచోడవరం, మారెడు మిల్లి అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు అందరూ మొగ్గు చూపుతున్నారు.

ఆచార్య యూనిట్..
ఆచార్య యూనిట్ కూడా ప్రస్తుతం అడవుల బాట పట్టేసింది. ఖమ్మంలోని ఇల్లెందులోని సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ చేసేందుకు ఆచార్య యూనిట్ పర్మిషన్ కూడా తీసుకుంది. ఇప్పుడు మళ్లీ మారెడు మిల్లీ అడవుల్లో ఆచార్య యూనిట్ చిత్రీకరణ చేస్తోంది.

చిరు, చెర్రీలపై..
ప్రస్తుతం చిరు, చెర్రీలపైనే కీలకమైన సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. నిన్న రామ్ చరణ్ ఓ స్టిల్ షేర్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ రాబోతోందంటూ అభిమానులు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఉపాసన కూడా అడవుల బాట పట్టినట్టు కనిపిస్తోంది.

చెర్రీ కోసం..
మెగా కోడలు ఉపాసన అప్పుడప్పుడు రామ్ చరణ్ షూటింగ్ ప్రాంతాలను విజిట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్‌తో పాటు షూటింగ్‌లో పాల్గొని ఆ సందడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది.తాజాగా ఉపాసన ఆచార్య సెట్‌లో అడుగుపెట్టేందుకు పయనమైంది.

ఫోటోలు వైరల్..
మారెడుమిల్లిలో జరుగుతున్న ఆచార్య షూటింగ్, చెర్రీని చూసేందుకు ఉపాసన హైద్రాబాద్ నుంచి బయల్దేరింది. కాసేపటి క్రితమే ఉపాసన రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











