చిరంజీవితో ఉపాసన అలా.. మెగా కోడలి వినయ విధేయతలకు ఫ్యాన్స్ ఫిదా!
ఎన్ని వేల కోట్లకు అధిపతి అయినా, ఎంత పెద్ద మహిళా వ్యాపారవేత్త అయినా కూడా మెగా కోడలు ఉపాసన మాత్రం ఒదిగే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీకి ఎంతో గౌరవాన్నిస్తుంటుంది. ఓ వైపు వ్యాపార సామ్రాజ్యం, మరో వైపు సామాజిక సేవలు ఇలా అన్నీ ఉన్నా కూడా భర్త, అత్తమామలను నిర్లక్ష్యం చేయదు. ఎప్పుడూ ఫ్యామిలీని అంటి పెట్టుకునే ఉంటుంది ఉపాసన. తాజాగా ఉపాసన ఎక్కడుందో అందరికీ తెలిసిందే.
Recommended Video

రెండ్రోజుల క్రితం..
రెండ్రోజుల క్రితం ఉపాసన రాజమండ్రికి వెళ్లింది. మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఆచార్య షూటింగ్ చూసేందుకు ఉపాసన వెళ్లింది. ఇక రెండ్రోజులు ఆచార్య సెట్‌లో ఉపాసన సందడి చేసింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి అక్కడి ప్రజలతో కలిసిపోయింది.

ప్యాకప్..
అయితే ఇప్పుడు రామ్ చరణ్ అక్కడి నుంచి ప్యాకప్ చెప్పే సమయం వచ్చింది. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇద్దరూ బయల్దేరారు. అయితే ఈ క్రమంలో తన మామయ్య చిరంజీవితో కలిసి కాసేపు ముచ్చటించినట్టు కనిపిస్తోంది.

ఫోటో బయటకు..
తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఉపాసన, చిరంజీవి ఉన్నారు. చిరంజీవి కుర్చీ మీద కూర్చుని ఉంటే.. ఆ పక్కనే నేలపైన ఉపాసన కూర్చుంది. ఎన్ని కోట్లకు వారసురాలైనా, ఒంటి చేత్తో కోట్ల వ్యాపారాలను నడిపిస్తున్నా కూడా మామయ్య ముందు మాత్రం అణుకువగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గతంలో అలా..
అయితే ఇలాంటి పొజిషన్‌లోనే గతంలో రామ్ చరణ్,చిరంజీవి కనిపించారు. గార్డెన్‌లో చిరంజీవి కుర్చీ మీద కూర్చుని ఉంటే.. రామ్ చరణ్ నేలపైన కూర్చుని ఉంటాడు. మొత్తానికి ఇప్పుడు ఉపాసన అప్పుడు రామ్ చరణ్.. ఇద్దరూ కూడా వినయాన్ని విధేయతను ప్రదర్శించారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

చిరంజీవి అక్కడే..
అయితే ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసనలు మారెడుమిల్లి నుంచి హైద్రాబాద్‌కు బయల్దేరారు. కానీ చిరంజీవి, ఆచార్య యూనిట్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. 20 రోజుల షెడ్యూల్‌ను రామ్ చరణ్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసేశాడు.


Click it and Unblock the Notifications











