మెగా ఈవెంట్లో రామ్ చరణ్‌తో అలా.. ఉపాసన ఓ ఉత్తమ భార్య!
మెగా ఈవెంట్ ఎప్పుడూ జరిగినా సరే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అది సెన్సేషనే. దీపావళి, సంక్రాంతి పండుగలకు ఎక్కువగా మెగా ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇక మధ్యలో అలాంటి గాదరింగ్, అందరూ కలవడమంటే ప్రత్యేకమైన సందర్భం ఉండాలి. నిన్న (ఆగస్ట్ 13) కూడా అలాంటి ఓ స్పెషల్ ఈవెంట్ జరిగింది. మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
నిహారిక-చైతన్యల నిశ్చితార్థం వేడుకులు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం మెరిసింది. ఇక ఈ మెగా ఈవెంట్లో జంటల సందడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు అర్జున్-స్నేహా, రామ్ చరణ్-ఉపాసన, కళ్యాణ్ దేవ్-శ్రీజ ఇలా జంటలన్నీ తెగ సందడి చేశాయి. ప్రత్యేకంగా ఫోటో షూట్లు కూడా చేయించుకున్నాయి. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

మెగా ఈవెంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్, స్నేహ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక చెర్రీ ఉపాసన ఎంతో సింపుల్‌గా దర్శనమిచ్చారు. తాజాగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో రామ్ చరణ్ మొహానికి మాస్క్ పెట్టుకోగా.. ఉపాసన వెనకాల నిల్చుని ఫోటోకు పోజులిచ్చింది. ఇక ఈ ఫోటోకు ఉపాసన పెట్టిన కామెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇదే మేము. నా రామ్ చరణ్ వెనకాల ఉండటమే నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఉపాసన చేసిన ఈ పోస్ట్‌కు ఉత్తమ భార్యఅంటే మీరే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











