ఈ శుక్రవారం రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
కరోనా.. ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి ఊపిరాడనివ్వకుండా చేసింది అనేది అందరికి తెలిసిన విషయమే. లాక్ డౌన్ అనంతరం కూడా జనాలు మళ్ళీ సినిమాలు చూడడానికి అసలు థియేటర్స్ కు వస్తారా లేదా అనేది అందరిలో ఒక భయాన్ని కలిగించింది. కానీ మొత్తానికి 50% ఆక్యుపెన్సీలోనే సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందొ అర్ధమయ్యింది. వరుసగా డిఫరెంట్ సినిమాలకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ శుక్రవారం మరిన్ని డిఫరెంట్ సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. వాటి బాక్సాఫీస్ టార్గెట్స్ పై ఒక లుక్కేస్తే..

ఆ సినిమాలు హిట్టవ్వడంతో..
సంక్రాంతి ఫెస్టివల్ నిజంగా సినిమా ఇండస్ట్రీలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మాస్టర్, క్రాక్, వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడంతో మిగతా వాళ్లకు చాలా ఆనందం కలిగింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో వచ్చిన ఉప్పెన, నాంది వంటి సినిమాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

సందీప్ కిషన్ టార్గెట్..
ఇక మార్చ్ లో కూడా మరిన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. మార్చ్ 5న మూడు డిఫరెంట్ సినిమాలు రానుండగా అందులో సందీప్ కిషన్ - A1 ఎక్స్ ప్రెస్ కాస్త భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. సందీప్ కు ఇది 25వ సినిమా. హాకి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 5కోట్ల షేర్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసినట్లు లెక్క.

రాజ్ తరుణ్ పవర్ ప్లే
ఇక చాలా కాలంగా మరో విజయం కావాలని ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. రాజ్ ఈ సారి కాస్త డిఫరెంట్ గా థ్రిల్లర్ జానర్ ను టచ్ చేస్తూ పవర్ ప్లే అనే సినిమాను చేశాడు. విక్రమ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలి అంటే రూ.2.1కోట్లను అందుకోవాల్సిందే.

మొగలిరేకులు యాక్టర్..
మొగలి రేకులు సినిమా ద్వారా ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కు చాలా దగ్గరైన వారిలో సాగర్ ఒకరు. ఈ యాక్టర్ ఆ మధ్య కొన్ని సినిమాలు చేసినప్పటికీ క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టాలని షాది ముబారక్ అనే సినిమాతో రాబోతున్నాడు. దిల్ రాజు ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.8కోట్లు. మరి ఈ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











