1997లో సుకుమార్ నెల జీతంతో ఎకరా పొలం కొనచ్చు, కానీ రూ.500కు ఆ మూవీకి పని చేశారు
సుకుమార్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉప్పెన సినిమాను ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించినప్పటికి ఒక విధంగా ఎక్కువ క్రెడిట్ సుకుమార్ కె దక్కుతోంది. ఎందుకంటే దర్శకుడు సపోర్ట్ చేయకుంటే ఎవరి శిష్యుడైన సరే అంత తొందరగా డైరెక్టర్ అవ్వలేడు. అయితే సుకుమార్ మాత్రం అందరిలాంటి వ్యక్తి కాదు. తన శిష్యులు కూడా తొందరగా పైకి రావాలని అనుకునే మంచి మనసున్న వ్యక్తి. ఇక సుకుమార్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు.

లవ్ స్టోరీస్ తో..
సుకుమార్ సినిమాల్లోకి రాకముందు ఇంటర్మీడియెట్ కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేశారని అందరికి తెలిసిన విషయమే. సుక్కు సినిమాలు కూడా లెక్కల మాదిరిగా ఆలోచించే విధంగా ఉంటాయి. లెక్కలు మాస్టర్ అనే ట్యాగ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది. ఆర్య సినిమా నుంచి చూసుకుంటే సుకుమార్ ఎక్కువగా లవ్ స్టోరీస్ తో జనాలకు కనెక్ట్ అయ్యారు.
యువ హీరోయిన్ పెర్లీ ఎద అందాల రచ్చ.. యవ్వారం మామూలుగా లేదుగా

దిల్ సినిమాకు అసిస్టెంట్ గా..
సుకుమార్ మొదట దిల్ సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేశాడు. ఒక విధంగా వినాయక్ అతనికి మొదటి గురువు అనే చెప్పాలి. ఆ సినిమాకు అసిస్టెంట్ గా పని చేసినందుకు నెలకు 500రూపాయలు అందుకునేవాడట. ఆ సినిమాతో దిల్ రాజుతో బాగా క్లోజ్ అయిన సుకుమార్ ఆర్యతో మెప్పించాడు. అల్లు అర్జున్ కూడా ఆ సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించడం వలన మొదటి అవకాశంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

ఆ రెండు సినిమాలతో..
ఇక జగడం, ఆర్య 2 వంటి డిజాస్టర్స్ ఎదురైనప్పటికి ఆయన రేంజ్ మాత్రం తగ్గలేదు. ఇక నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు మరో లెవెల్ కు తీసుకు తీసుకెళ్ళాయి. నిజానికి సుకుమార్ ఇండస్ట్రీలో రావడానికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సౌమ్యంగా ఉన్నట్లు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు వివరణ ఇచ్చారు.

ఆర్య 2 నుంచి..
బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అని అందరికి తెలిసిన విషయమే. కేవలం సినిమా పరమైన శిష్యుడే కాదు. సుకుమార్ అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా శిష్యుడే. పట్టుబట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సుకుమార్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్య 2 నుంచి అతను సుకుమార్ సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేస్తున్నాడు.

క్లాస్ విన్న తరువాత సినిమాకు
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ లెక్చరర్ గా ఉన్నప్పుడు ఆయన జీవిత, జీతం గురించి కూడా చెప్పాడు బుచ్చిబాబు. ముఖ్యంగా సినిమాకు వెళతామని అంటే నా క్లాస్ విని వెళ్లాలని అనేవారని, 50 రూపాయలు కూడా ఇచ్చేవారని అంటూ ఆ రోజుల్లో 50రూపాయలు అంటే మామూలు విషయం కాదని వివరించాడు.

ఆయన జీతం ఎంతంటే..
కొన్నిసార్లు ఆయనతో సైకిల్ పై సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతూ.. 1997లో సుకుమార్ జీతం నెలకు 70వేలకు పైగా ఉండేది. అంటే అప్పట్లో మా ఊర్లో ఎకరం 50 వేలు ఉండేదని చెప్పిన బుచ్చిబాబు ఆ స్థాయిలో టాప్ మ్యాథ్స్ టీచర్ గా గుర్తింపు అందుకున్నారని ఫ్యామిలీ కూడా చాలా సింపుల్ గా ఉంటుందని వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











