Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉప్పెన దర్శకుడంటే Jr ఎన్టీఆర్కు ఎందుకంత ఇష్టం.. ఏకంగా ఎత్తుకొని మరీ నీళ్ళల్లో పడేశాడట
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి పేరును కూడా షూటింగ్ ముగిసే వరకు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఎంతో నచ్చితే గాని తారక్ వాళ్ళతో చనువుగా ఉండడు. అయితే ఉప్పెన దర్శకుడిని జూనియర్ ఎన్టీఆర్ చాలా లైక్ చేస్తాడని బయటవారికి అంతగా తెలియదు. తారక్ తో అతనికున్న సాన్నిహిత్యం గురించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ఇటీవల తారక్ ఉప్పెన ట్రైలర్ ను తన చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
పనితనం ఎలా ఉంటుందో అర్ధమయ్యింది.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన మొదటి పాటతోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తారక్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ తోనే బుచ్చిబాబు పనితనం ఎలా ఉంటుందో అర్ధమయ్యింది.
సుకుమార్ దగ్గర ఆర్య 2 నుంచి..
దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అని అందరికి తెలిసిన విషయమే. ఇక అతను కేవలం సినిమా పరమైన శిష్యుడే కాదు. సుకుమార్ అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా శిష్యుడే. పట్టుబట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సుకుమార్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్య 2 నుంచి అతను సుకుమార్ సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేస్తున్నాడు.
సుక్కు సక్సెస్ లో అతని పాత్ర
కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా కూడా సుక్కు సినిమాలకు వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అతని పాత్ర ఎంతగానో ఉంది. ఇక ఇండస్ట్రీలో తనతో పాటు తన అసిస్టెంట్స్ కూడా ఎదగాలి అనుకునే అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన సపోర్ట్ తోనే బుచ్చిబాబు మొదటి సినిమా సెట్స్ పైకి వచ్చింది.
తారక్ అలా కనెక్ట్ అయ్యాడు
ఇక ఈ దర్శకుడు ఎన్టీఆర్ కు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నాన్నకు ప్రేమతో రైటర్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఉన్నటువంటి బుచ్చిబాబు ఆ సినిమాకు పని చేసిన విధానం తారక్ కు బాగా నచ్చేసింది. అంతే కాకుండా అతని అమాయకత్వంతో పాటు చెప్పే విధానం కూడా తారక్ కు కనెక్ట్ అయ్యేలా చేశాయి.
ఎత్తుకొని నీళ్ళల్లో పడేసిన తారక్
ఒకసారి ఎన్టీఆర్ బుచ్చిబబును ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో ఎత్తుకొని మరి పడేశాడు. నాన్నకు ప్రేమతో ఫారిన్ లొకేషన్ షూట్ లో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా చలి చలి అంటూ బుచ్చిబాబు వనికిపోతుంటే జూనియర్ ఎన్టీఆర్ సరదాగా అతన్ని నీళ్ళల్లోకి ఎత్తుకొని పడేశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.
ఉప్పెన కథ చెప్పింది.. మొదట ఎన్టీఆర్ కే..
ఇక ఇన్నాళ్లకు తారక్ కు ఇష్టమైన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకుడిగా అవుతుండడంతో తన వైపు నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. అయితే ఉప్పెన కథను జడ్జిమెంట్ కోసమని గురువుగారి తరువాత అందరికంటే ముందు చెప్పింది ఎన్టీఆర్ కే నట. ఆ తరువాత చిరంజీవి దగ్గరకు వెళ్లినట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. ఇక బుచ్చిబాబు హిట్టు కొడితే భవిష్యత్తులో తారక్ తో తప్పకుండా సినిమా చేస్తాడని చెప్పవచ్చు.