20 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసిన ఉప్పెన జోడి..!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి ఇద్దరు కూడా ఏ క్షణాన సినిమా చేయడానికి ఒప్పుకున్నారో తెలియదు గాని ఉప్పెన సినిమాతో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ డెబ్యూ హిట్ అందుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా నెంబర్ డెబ్యూ జోడిగా రికార్డు క్రియేట్ చేశారు.
2000వ సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ అమీషా పటేల్ జంటగా నటించిన "కహి నా.. ప్యార్ హై" అనే సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమాతోనే వాళ్ళు హీరో హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. . బెస్ట్ హీరో హీరోయిన్ డెబ్యూ సినిమాగా క్రేజ్ అందుకున్న ఆ సినిమా 41కోట్ల షేర్స్ అందించింది అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు వైష్ణవ్, కృతి శెట్టిలు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పటికే ఉప్పెన 50కోట్ల షేర్స్ కు దగ్గరువుతున్న విషయం తెలిసిందే. అయితే "కహి నా.. ప్యార్ హై" అప్పట్లో అందుకున్న కలెక్షన్స్ ను ఇప్పటి సినిమాలతో పోల్చితే అదే పెద్ద రికార్డ్ అని చెప్పవచ్చు. కానీ కేవలం నెంబర్ల ప్రకారం చూస్తే మాత్రం ఉప్పెన ఆ మార్క్ ను దాటేసి చిత్ర యూనిట్ కు ఒక మంచి గుర్తింపును అందించింది.


Click it and Unblock the Notifications











