మెగా హీరోను తమ్ముడిలా ట్రీట్ చేస్తున్న jr ఎన్టీఆర్.. చరణ్ కంటే ఎక్కువగా..

స్టార్ హీరోల మధ్య వాతావరణం నిజంగానే చాలా మారుతోంది. ఒకప్పటి జనరేషన్స్ లో హీరోల మధ్య ఈగోలు ఉన్నట్లు బాగా రూమర్స్ వచ్చాయి. కానీ నేటితరం స్టార్స్ మధ్య అలాంటివేమి కనిపించడం లేదు. గాసిప్స్ కు కూడా తావివ్వకుండా ఫ్రెండ్లిగా ఉంటున్నారు. ఒకరి సినిమాకు మరొకరు ప్రమోషన్ లో సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇక నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య వాతావరణం కూడా చాలానే మారుతోంది. రూమర్స్ ఎన్ని ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీతో ఒక మంచి బాండింగ్ కనిపిస్తోంది.

జూనియర్ అంటే అందరికి ఇష్టమే..

జూనియర్ అంటే అందరికి ఇష్టమే..

జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్క యాక్టర్ కు ఎంతో ఇష్టం. అతని ఆల్ రౌండర్ టాలెంట్ ను చూసి చాలా నేర్చుకోవాలని కూడా చెబుతుంటారు. ఇక తారక్ పర్సనల్ లైఫ్ లో ఎంతగానో కష్టపడి నందమూరి వంశంలోనే అత్యదిక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తోటి హీరోలతో తారక్ చాలా సరదాగా ఉంటారన్నది అందరూ చెప్పేదే.

ఆ సినిమా ద్వారా..

ఆ సినిమా ద్వారా..

జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరైనా కనెక్ట్ అయితే అంత తొందరగా వదిలి పెట్టడని చెప్పవచ్చు. ఇక చాలా కాలం నుంచి మెగా హీరో రామ్ చరణ్ తో కూడా తారక్ క్లోజ్ గా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి RRR సినిమాలో హిస్టారికల్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో వారి స్నేహం మరింత బలపడింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం రెండు వర్గాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సొంత తమ్ముడిలాగా..

సొంత తమ్ముడిలాగా..

అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో ఎంత క్లోజ్ గా ఉంటాడో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ను కూడా అలానే ట్రీట్ చేస్తున్నాడు. సొంత తమ్ముడిలాగా తనను చూసుకుంటున్నాడని వైష్ణవ్ ఇంటర్వ్యూలలో చెబుతుండడంతో నందమూరి అభిమానులు కూడా నచ్చుతోంది. ఈ మెగా హీరోకి చాలా వరకు అన్ని వర్గాల అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

అలా వైష్ణవ్ తో పరిచయం..

అలా వైష్ణవ్ తో పరిచయం..

ఉప్పెన సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు అంటే కూడా తారక్ కు నచ్చిన వ్యక్తి. నాన్నకు ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి నుంచి వారి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. ఇక తరచు రామ్ చరణ్ ను కలిసినప్పుడు ఎన్టీఆర్, వైష్ణవ్ ను కూడా కలిసేవాడట. మొదటిసారి చరణ్ అన్నా ఇంట్లోనే తారక్ అన్నాను చూశానని చెప్పాడు వైష్ణవ్.

సలహాలు ఇచ్చేవారు

సలహాలు ఇచ్చేవారు

ఇక ఉప్పెన సినిమా మొదలైనప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ సినిమా ఎలా వస్తుందని ఫోన్ కాల్ ద్వారా కనుక్కునే వారని అలాగే ఆయన వైపు నుంచి కూడా సలహాలు ఇచ్చే వారని కూడా వైష్ణవ్ తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో మంచు మనోజ్ కూడా తనకు చాలా క్లోజ్ గా ఉంటారని వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X