For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘వకీల్ సాబ్’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో: ఆ తర్వాతే పవన్ చేతిలోకి.. అప్పుడు అనుకున్న టైటిల్ ఇదే

  |

  'వకీల్ సాబ్' ఇటీవలి కాలంలో ఈ సినిమా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దీనికి కారణం చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దీని ద్వారా రీఎంట్రీ ఇవ్వడమే. అందుకే ఈ సినిమా విడుదలను ఫ్యాన్స్ పండుగలా జరుపుకున్నారు. తద్వారా దాదాపు నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో 'వకీల్ సాబ్' మేనియా కనిపించింది. ఇంతటి ప్రభావం చూపించిన ఈ మూవీ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఈ సినిమాను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన తర్వాతనే పవన్ ఎంట్రీ ఇచ్చాడట. ఇంతకీ ఎవరా హీరో? ఆ వివరాలు మీకోసం!

  ‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇచ్చిన పవన్

  ‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇచ్చిన పవన్

  మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్'. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

  ప్రభుత్వం నుంచి ఆ సవాళ్లు ఎదురు

  ప్రభుత్వం నుంచి ఆ సవాళ్లు ఎదురు

  సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్' విడుదలకు ముందు నుంచే ఫ్యాన్స్ యమ హంగామా చేశారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ వెంటనే టికెట్ రేట్లను సైతం తగ్గించాలని జగన్ సర్కారు కొత్త జీవోను తీసుకొచ్చింది. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఏపీ సీఎంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

  కలెక్షన్లకు కోత.. నిర్మాతకు నష్టాలు

  కలెక్షన్లకు కోత.. నిర్మాతకు నష్టాలు


  ఆరంభం నుంచే ‘వకీల్ సాబ్' సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి సవాళ్లు ఎదురవడంతో కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. దీనితో పాటు కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఫుల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోలేదీ చిత్రం. ఫలితంగా నిర్మాతకు నష్టాలు ఎదురయ్యాయి.

  అందులో విడుదల... భారీ రెస్పాన్స్‌

  అందులో విడుదల... భారీ రెస్పాన్స్‌

  ‘వకీల్ సాబ్' మూవీ థియేటర్లలో ఎన్నో రోజులు ఆడలేదు. దీంతో అనుకున్న సమయానికంటే ముందుగానే దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో సైతం ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఎక్కువ క్లిక్కులు సాధించిన చిత్రాల జాబితాలో పవన్ మూవీ చోటు దక్కించుకుంది. అదే సమయంలో లాభాలనూ అందించింది.

  ఈ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

  ఈ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

  ‘వకీల్ సాబ్' మూవీ విడుదలై దాదాపు నెల రోజులకు పైగానే అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన హడావిడి కూడా ఎప్పుడో తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే ముందే ఈ సినిమా నటసింహా నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట. కానీ, ఆయన రిజెక్ట్ చేశారట.

  అప్పుడు అనుకున్న టైటిల్ ఇదేనట

  అప్పుడు అనుకున్న టైటిల్ ఇదేనట

  బాలీవుడ్‌లో ‘పింక్' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ తర్వాత దీన్ని తమిళంలో రీమేక్ చేశారు. ఆ సమయంలోనే బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. నటసింహా నందమూరి బాలకృష్ణతో ఈ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిపారట. అంతేకాదు, అప్పుడు దీనికోసం ఫిలిం ఛాంబర్‌లో ‘లాయర్ సాబ్' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని తెలిసింది.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  ఆ కారణంగా రిజెక్ట్.. పవర్ స్టార్ ఎంట్రీ

  ఆ కారణంగా రిజెక్ట్.. పవర్ స్టార్ ఎంట్రీ

  మొదట ఈ సినిమాలో నటించేందుకు నందమూరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే, ఇందుకోసం ఇప్పుడే డేట్స్ కేటాయించలేనని చెప్పారట. దీనికి కారణం అప్పుడు ఆయన కేఎస్ రవికుమార్‌తో ‘రూలర్' సినిమా చేస్తున్నారు. సో.. డేట్స్ కేటాయించలేని కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారట. ఆ తర్వాతనే దిల్ రాజు పవన్‌ను సంప్రదించారని సమాచారం.

  English summary
  Senior Hero Nandamuri Balakrishna Rejected Vakeel Saab Movie. after Pawan Kalyan Complete This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X