Valentines Day: ప్రేమికులు మెచ్చిన టాప్ తెలుగు మూవీలు ఇవే.. చూస్తే గుండె బరువెక్కిపోవాల్సిందే!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తుంటాయి. అందులో ప్రతి ఒక్కరిలోని ప్రేమను గుర్తు చేసే చిత్రాలు కూడా తెరకెక్కుతూ ఉంటాయి. ఇలా టాలీవుడ్‌లో వందల సంఖ్యలోనే సినిమాలు రూపొందాయి. అలాగే, వేరే భాషల నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను పొందడంతో పాటు ప్రతి ఒక్కరి ఎమోషన్స్‌ను టచ్ చేసి ఏడిపించాయి. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ కథలతో వచ్చి గుండె బరువు పెంచేసిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి!

అభినందన:ఓ విఫల ప్రేమ కథతో రూపొందిన ఎమోషనల్ మూవీనే 'అభినందన'. అశోక్ కుమార్ దర్శకత్వంలో కార్తీక్, శోభన జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను హృదయాలను టచ్ చేసింది. తద్వారా మంచి స్పందనను అందుకుని కమర్షియల్‌గానూ సక్సెస్ అయింది. ముఖ్యంగా ఇందులోని పాటలకు అద్భుత స్పందన వచ్చింది. అందుకే ఈ చిత్రం ఎవర్‌గ్రీన్ లిస్ట్‌లో చేరింది.

Valentines Day 2024: Best Love Story Movies in Telugu Film Industry

గీతాంజలి:అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రమే 'గీతాంజలి'. మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీలో గిరిజ హీరోయిన్‌గా నటించారు. తలో వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం వచ్చింది. దీనికి భారీ స్పందన రావడంతో పాటు ఎన్నో అవార్డులు దక్కాయి. అప్పట్లో ఈ చిత్రం ఎంతో మందిని ఏడిపించిందనే చెప్పాలి.

సుస్వాగతం:ప్రేమ పిచ్చిలో పడి ప్రపంచాన్ని మర్చిపోతున్న తరానికి మంచి సందేశాన్ని ఇవ్వడంతో పాటు అసలైన ప్రేమకు అర్థం చెప్పిన సినిమానే 'సుస్వాగతం'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ అవడంతో పాటు యువతను ఆలోచింపజేసిందని చెప్పాలి.

Valentines Day 2024: Best Love Story Movies in Telugu Film Industry

బృందావన కాలనీ:సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే '7G బృందావన్ కాలనీ'. ఓ విఫల ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా తమిళం, తెలుగులోనూ విడుదలైంది. అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందనను అందుకుని సక్సెస్ అయింది. అదే సమయంలో ప్రేమ కథా చిత్రాల ట్రెండ్‌కు కొత్త రూపును పరిచయం చేసింది.

ప్రేమిస్తే:బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో భరత్, సంధ్య జంటగా నటించిన చిత్రమే 'ప్రేమిస్తే'. ఓ యదార్థ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా విఫలమైన లవ్ స్టోరీతోనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా తెలుగు, తమిళం భాషల్లోనూ ఇది విజయాన్ని అందుకుంది. అదే సమయంలో ఇది ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

Valentines Day 2024: Best Love Story Movies in Telugu Film Industry

ఓయ్:ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్, శామిలీ జంటగా నటించిన చిత్రమే 'ఓయ్'. ఓ వ్యాధితో బాధ పడుతున్న అమ్మాయి ప్రేమ కోసం హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. మరి చివరికి వీళ్ల ప్రేమ ఏమైంది అనే పాయింట్‌తో ఇది తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకున్నా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్ని పిండేసిందని చెప్పాలి.

Valentines Day 2024: Best Love Story Movies in Telugu Film Industry

బేబి:సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన చిత్రమే 'బేబి'. విఫల ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాదు.. అప్పటి 'దేవదాసు' నుంచి మొన్నటి RX 100 వరకూ ఇలాంటి తరహా సినిమాలు చాలానే వచ్చాయి. తద్వారా ప్రేమికుల మనసులు దోచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X