నయన్, అనసూయ వంతైపోయింది.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ రచ్చ షురూ!!

ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు గోవాకు చెక్కేస్తున్నారు. ఫ్యామిలీని తీసుకుని గోవాకు వెళ్లి అక్కడే బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. నయన్-విఘ్నేష్ జంట గోవాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. అక్కడే నయన్ తన తల్లి మిస్ కురియన్, విఘ్నేష్ బర్త్ డేలను ఘనంగా సెలెబ్రేట్ చేసింది. ఇక ఈ మధ్యే అనసూయ తన ఫ్యామిలీని గోవాకి తీసుకెళ్లింది. భర్త సుశాంక్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ వంతు వచ్చింది.

నయన్ అలా..

నయన్ అలా..

ఓనం పండుగ కోసం వచ్చిన నయన్ విఘ్నేష్.. అటునుంచి అటే గోవాకు చెక్కేశారు. అక్కడే మూడు రోజులు మకాం వేశారు. నయన్ తన తల్లి కురియన్ బర్త్ డేను, ప్రియుడి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. ఇలా ఆమె చేసిన ఖర్చులు, ఫ్లైట్‌లో తిరిగిన లెక్కలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అనసూయ ఇలా..

అనసూయ ఇలా..

ఇక నయన్ రేంజ్ వేరే లెవెల్ కాబట్టి ఫ్లైట్ వాడింది. అనసూయ తన రేంజ్‌లో తన భర్త పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. రోడ్డు మార్గం గుండా ఫ్యామిలీని తీసుకుని గోవాకు వెళ్లింది అనసూయ. తన భర్తకు ప్రేమగా చెప్పిన విషెస్, కుర్రాళ్లకు మత్తెక్కించేలా షేర్ చేసిన ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా అనసూయ గోవా ట్రిప్ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇప్పుడు వనిత..

ఇప్పుడు వనిత..

ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ ఫ్యామిలీ గోవాలోనే ఉంది.. వనిత పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసేందుకు పీటర్ పాల్ గోవాకు ట్రిప్ వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రోడ్డు ట్రిప్‌కు సంబంధించిన వీడియోను వనిత షేర్ చేసింది. ఇక బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Biggboss Tamil Season 3 Contestants Complete Details | Biggboss Tamil 3 | Kamal Haasan | Filmibeat
మందు కూడా..

మందు కూడా..

ఇక గోవాలో తన 40వ పుట్టిన రోజు ఘనంగా సెలెబ్రేట్ చేశారని, తన కూతురు మంచి బహుమతి కూడా ఇచ్చిందని వనిత పేర్కొంది. అక్కడ హోటల్ వారు చేసిన మర్యాదలు, స్వాగత సత్కారాలకు వనిత పొంగిపోయినట్టు కనిపిస్తోంది. మందు సీసాలను కూడా పోస్ట్ చేస్తూ అందరికీ చీర్స్ చెప్పింది. మొత్తానికి ఇలా అందరూ గోవాలో బర్త్ డే వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X