మరో పవర్ పుల్ పాత్రలో వరలక్ష్మీ.. ఏసీపీ సిధిక లుక్ వైరల్
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు మార్మోగిపోతోంది. విలన్ పాత్రలకైనా, సపోర్టింగ్ రోల్స్‌కైనా వరలక్ష్మీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ ఏడాదిలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటోంది వరలక్ష్మీ. క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రలో జీవించింది. అలా సంక్రాంతి బరిలో జయమ్మగా వరలక్ష్మీ రచ్చచేసింది. ఆ తరువాత నాంది సినిమాతో మరోసారి హాట్ టాపిక్అయింది.
అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి చేసిన ప్రయోగం నాంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో వరలక్ష్మీ కనిపించింది. ఆద్యగా ఎంతో ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తన నటనతో అందరినీ ఏడిపించేసింది. అలా వరలక్ష్మీకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో డిమాండ్ ఫుల్లుగా పెరిగిపోయింది. అయితే తాజాగా వరలక్ష్మీకి మరో క్రేజీ క్యారెక్టర్ వచ్చినట్టు కనిపిస్తోంది.

తెనాలి రామకృష్ణ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోంది. సందీప్ కిషన్ 27వ చిత్రంలో వరలక్ష్మీ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. ఏసీపీ సిధిక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











