మెగా హీరోను టార్గెట్ చేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్: మరో యాంగిల్ చూపించేందుకు ప్లాన్ రెడీ!

వరలక్ష్మీ శరత్ కుమార్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం ఇటీవలి కాలంలో ఈమె నటించిన సినిమాలే. సాధారణంగా హీరోయిన్‌గా పరిచయం అయిన అమ్మాయిలు.. అవే తరహా సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంటారు. కానీ, ఈ కోలీవుడ్ స్టార్ మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉంటే చాలు.. ఎలాంటి సినిమాలోనైనా నటిస్తుంది. ఇప్పటికే తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. తెలుగులోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ ఇచ్చింది.. దక్షిణాదిలో హల్‌చల్

అలా ఎంట్రీ ఇచ్చింది.. దక్షిణాదిలో హల్‌చల్

శరత్ కుమార్ కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది వరలక్ష్మీ. మంచి నటి అవ్వాలన్న పట్టుదలతో చదువు పూర్తయిన వెంటనే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలోనే 'పోడా పొడి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే ఏకంగా కన్నడ సినిమాల్లోనే ఛాన్స్ పట్టేసింది. అప్పటి నుంచి దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లోనూ నటించి మెప్పిస్తోంది.

హీరోయిన్ నుంచి పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా

హీరోయిన్ నుంచి పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా

వరలక్ష్మీ శరత్ కుమార్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే అత్యుత్తమ నటనతో ఆకట్టుకుంది. ఆమె కెరీర్‌లో 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. హీరోయిన్‌గా సక్సెస్ అయిన ఈ అమ్మాయి.. 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి స్టార్ హీరోల చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి అదరగొట్టేసింది.

జయమ్మగా తెలుగు వాళ్లను భయపెట్టింది

జయమ్మగా తెలుగు వాళ్లను భయపెట్టింది

తమిళం, కన్నడం, మలయాళంలో వరుసగా సినిమాలు చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది. అయితే, ఇటీవల వచ్చిన రవితేజ చిత్రం 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్ర తెలుగు ప్రేక్షకులను భయపెట్టేసింది.

నరేష్‌కు విముక్తి కలిగిందిచిన లాయర్ ఆద్యా

నరేష్‌కు విముక్తి కలిగిందిచిన లాయర్ ఆద్యా

'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన చిత్రం 'నాంది'. కామెడీ చిత్రాలతో కెరీర్‌ను ముందుకు సాగిస్తోన్న అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. ఇందులో లాయర్ ఆద్యగా కనిపించిన వరలక్ష్మీ.. తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించింది. ముఖ్యంగా హీరోను కాపాడే పాత్రను అద్భుతంగా పోషించింది.

అల్లు అర్జున్‌ను బాగా టార్గెట్ చేస్తున్న వరలక్ష్మీ

అల్లు అర్జున్‌ను బాగా టార్గెట్ చేస్తున్న వరలక్ష్మీ

'క్రాక్', 'నాంది' సినిమాల తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్‌కు తెలుగులో మంచి పేరు వచ్చింది. నటన పరంగా ఆకట్టుకోవడంతో పాటు లక్కీ చార్మ్‌గా మారిందామె. దీంతో ఈ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ డేట్స్ కోసం తెలుగు ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మీ శరత్ కుమార్.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంతకం చేసిందని టాక్.

మరో యాంగిల్ చూపించేందుకు ప్లాన్ రెడీగా

మరో యాంగిల్ చూపించేందుకు ప్లాన్ రెడీగా

బన్నీ - కొరటాల కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. యువసుధ బ్యానర్, GA2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందనుంది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ పొలిటీషియన్‌గా వరలక్ష్మీ నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఈ పాత్ర ద్వారా తనలోని మరో యాంగిల్‌ను చూపించేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X