For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఏంజిల్ అంటూ వరుణ్ సందేశ్ రచ్చ.. కౌగిలిలో వితిక షెరు బంధీ.

    |

    వరుణ్ సందేశ్ వితిక షెరు జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. బిగ్ బాస్ షో మూడో సీజన్‌లో జంటగా పాల్గొన్న ఈ ఇద్దరికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అంతకు ముందు వరకు వరుణ్ సందేశ్ భార్యగా కొందరికి వితిక తెలుసు. ఆమె చేసిన సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాలేదు. హీరోయిన్‌గా వితిక షెరు అంతగా పేరు తెచ్చుకోలేకోయినా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.

    తొలిసారిగా అలా..

    తొలిసారిగా అలా..

    బిగ్ బాస్ ఇంట్లోకి భార్యాభర్తలు ఎంట్రీ ఇవ్వడమన్నది సర్వసాధారణంగా జరగదు. ఇంతకు ముందు తెలుగులో, దక్షిణాది భాషల బిగ్ బాస్ షోలో అయితే అంత వరకు జరగలేదు. కానీ వరుణ్ సందేశ్ వితికాలు జంటగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు.

     మొదట్లో నెగెటివ్..

    మొదట్లో నెగెటివ్..

    భార్యాభర్తలను లోపలికి పంపించి తగువులు పెట్టిస్తారా? ఇద్దరినీ విడగొడతారా? అనే నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. వరుణ్ సందేశ్ వితిక షెరుల మధ్య గొడవలు జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ వరుణ్ సందేశ్ వితికలు మాత్రం ఎంతో అన్యోన్యంగా గడుపుతూ వచ్చారు.

    వరుణ్‌కి పాజిటివ్..

    వరుణ్‌కి పాజిటివ్..

    అయితే వరుణ్ సందేశ్‌కి పాజిటివ్.. వితిక షెరుకు కాస్త నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. వితికా షెరు అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ చెబుతూ ఉండటంతో నెగెటివిటీ పెరిగిపోయింది. బయటకు వచ్చాక కూడా వితిక షెరుపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

     ఈ మధ్య అలా..

    ఈ మధ్య అలా..

    వితిక షెరు ఈ మధ్య తన చెల్లి పెళ్లి అంటూ రచ్చ రచ్చ చేస్తోంది. వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ నానా హంగామా చేస్తోంది. వితిక సోదరి పెళ్లిలో అషూ, పునర్నవి, లాస్య, శివజ్యోతి, హిమజ వంటి వారంతా సందడి చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో రచ్చతో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

    Acharya Teaser : నిడివి నిమిషం పైనే.. చిరు పవర్ ఫుల్ డైలాగ్ తో.. Chiranjeevi | Ram Charan
    వితిక బర్త్ డే..

    వితిక బర్త్ డే..

    నేడు వితిక బర్త్ డే. ఈ సందర్భంగా తన శ్రీమతికి వరుణ్ సందేశ్ స్పెషల్ విషెస్ అందించాడు. నా దేవతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆ దేవుడు నీకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశాడు.

    English summary
    Varun sandesh birthday Wishes to Vithika Sheru
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X