Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నా ఏంజిల్ అంటూ వరుణ్ సందేశ్ రచ్చ.. కౌగిలిలో వితిక షెరు బంధీ.
వరుణ్ సందేశ్ వితిక షెరు జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. బిగ్ బాస్ షో మూడో సీజన్లో జంటగా పాల్గొన్న ఈ ఇద్దరికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అంతకు ముందు వరకు వరుణ్ సందేశ్ భార్యగా కొందరికి వితిక తెలుసు. ఆమె చేసిన సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాలేదు. హీరోయిన్గా వితిక షెరు అంతగా పేరు తెచ్చుకోలేకోయినా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.
తొలిసారిగా అలా..
బిగ్ బాస్ ఇంట్లోకి భార్యాభర్తలు ఎంట్రీ ఇవ్వడమన్నది సర్వసాధారణంగా జరగదు. ఇంతకు ముందు తెలుగులో, దక్షిణాది భాషల బిగ్ బాస్ షోలో అయితే అంత వరకు జరగలేదు. కానీ వరుణ్ సందేశ్ వితికాలు జంటగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు.
మొదట్లో నెగెటివ్..
భార్యాభర్తలను లోపలికి పంపించి తగువులు పెట్టిస్తారా? ఇద్దరినీ విడగొడతారా? అనే నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. వరుణ్ సందేశ్ వితిక షెరుల మధ్య గొడవలు జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ వరుణ్ సందేశ్ వితికలు మాత్రం ఎంతో అన్యోన్యంగా గడుపుతూ వచ్చారు.
వరుణ్‌కి పాజిటివ్..
అయితే వరుణ్ సందేశ్‌కి పాజిటివ్.. వితిక షెరుకు కాస్త నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. వితికా షెరు అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ చెబుతూ ఉండటంతో నెగెటివిటీ పెరిగిపోయింది. బయటకు వచ్చాక కూడా వితిక షెరుపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఈ మధ్య అలా..
వితిక షెరు ఈ మధ్య తన చెల్లి పెళ్లి అంటూ రచ్చ రచ్చ చేస్తోంది. వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ నానా హంగామా చేస్తోంది. వితిక సోదరి పెళ్లిలో అషూ, పునర్నవి, లాస్య, శివజ్యోతి, హిమజ వంటి వారంతా సందడి చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో రచ్చతో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.
Recommended Video
వితిక బర్త్ డే..
నేడు వితిక బర్త్ డే. ఈ సందర్భంగా తన శ్రీమతికి వరుణ్ సందేశ్ స్పెషల్ విషెస్ అందించాడు. నా దేవతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆ దేవుడు నీకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశాడు.