అస్సలు గుర్తుపట్టని విధంగా టాప్ కమెడియన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లుక్

నా నాటికీ పెరుగుతున్నటెక్నాలజీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎన్నో ఆశ్చర్యపరిచే ఫీచర్స్ చూస్తున్నాం. ప్రపంచాన్నే చుట్ట చుట్టి మొబైల్ లో చూపిస్తున్న నేటి సమాజంలో సరికొత్తగా వస్తున్న కొన్ని యాప్స్ భవిష్యత్ లో మనిషి జీవితాన్ని సైతం మనముందుంచుతున్నాయి. ఈ కోవలోనే మార్కెట్ లో 'ఫేస్‌యాప్' పేరుతో ఒక యాప్ అందుబాటులోకి వచ్చి ట్రెండింగ్ అవుతోంది.

ఈ యాప్ ద్వారా ముసలితనం వచ్చాక తమ రూపం ఎలా ఉంటుందనేది చూసుకోవచ్చు. దీంతో సాధారణ జనం మొదలుకొని సెలబ్రిటీల వరకూ ఈ యాప్ ఉపయోగించి తమ తమ ఓల్డేజ్ లుక్స్ చెక్ చేసుకుంటున్నారు. పైగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ప్రస్తుతం సెలెబ్రిటీల తాలూకు ఓల్డేజ్ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Vennela Kishores Old Filter look goes viral

టీం ఇండియా ఆటగ్గాళ్లు మొదలుకొని.. మహేష్ బాబు, ఎన్టీఆర్, సోనమ్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ తమ ఓల్డేజ్ లుక్స్ అభిమానులతో పంచుకోగా తాజాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా తన ఓల్డేజ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో అస్సలు గుర్తుపట్టని విధంగా మారిపోయాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

వెన్నెల కిషోర్ పోస్ట్ అంటే ఇతర సెలబ్రెటీలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా స్పందిస్తూ ఆయన్ను కామెంట్ చేస్తున్నారు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ కామెడీ సృష్టిస్తున్నావని అంటున్నారు. దీంతో వెన్నెల కిషోర్ ఓల్డేజ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X