రాంచరణ్ కూతురు క్లింకార జాతకంపై ట్రోలింగ్.. ఆ మూర్ఖులకు తెలియదా? వేణు స్వామి ఫైరింగ్

కొన్ని రోజుల క్రితం సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి రామ్ చరణ్, ఉపాసన దంపతుల వారసురాలు క్లింకార జాతకం గురించి జ్యోతిష్యం చెప్పి తీవ్రమైన ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. తాజాగా వేణు స్వామి ఈ విషయం గురించి స్పందిస్తూ వాళ్ళు మూర్ఖులు అంటూ ఫైర్ అయ్యారు. మరి ఇంతకీ క్లింకార విషయంలో వేణు స్వామి మళ్లీ ఎలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ క్లింకార జ్యోతిష్యం గురించి మరోసారి ప్రస్తావించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో చాలా మంది బేబీ పుట్టడానికి ముహూర్తాలు చూసుకోవడమే కాకుండా పుట్టిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారు? వంటి ప్రశ్నలు మీకు చాలానే వచ్చి ఉంటాయి. అసలు పుట్టిన పిల్లలకి జాతకం చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే జాతకరీత్యా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందా? అని వేణు స్వామిని ప్రశ్నించారు.

Venu Swamy Serious on Netizen s trolling on Ram Charan s Daughter Klinkara Astrology

అందుకాయన స్పందిస్తూ 100% ఉంటుంది. కానీ సాధారణంగా 12 సంవత్సరాలు తర్వాత మాత్రమే జాతకం రాయాలని, కొంతమందికి మాత్రం పుట్టిన పది నిమిషాలకు కూడా జాతకం చెప్పొచ్చని అన్నారు వేణు స్వామి. అయితే ఈ మధ్యన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన బిడ్డ జాతకాన్ని విశ్లేషించినప్పుడు చాలా మంది మూర్ఖులు వచ్చి తనను విమర్శించారని వేయన స్వామి గుర్తు చేసుకున్నారు.

అసలు చంటి పిల్ల జాతకం చెప్పడం ఏంటి అని ప్రశ్నించారని, అయితే అప్పట్లో రాజుల దగ్గర జ్యోతిష్యులు ఉండేవారని, పుట్టగానే రాజకుమారి లేదా రాజకుమారుడి జ్యోతిష్యాన్ని గంటకే రాస్తారని ఈ మూర్ఖులకు తెలియదా? అంటూ వేణు స్వామి ఫైర్ అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు సెలబ్రిటీలు. అలాంటి వాళ్లకు పుట్టిన అమ్మాయి మీద జాతకం చెప్తే ఎంతోమంది ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి కచ్చితంగా ఆమె జాతకం రాయచ్చు అని చెప్పారు.

కానీ బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాన్ని రాయొద్దని, బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాన్ని అంటే ఏడు సంవత్సరాల లోపు పిల్లలకు గండాలు ఉంటే, ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాలని రాయొద్దు అని శాస్త్రం చెబుతోందని అన్నారాయన. అంతేకాకుండా కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారి జాతకాలను ఏడవ రోజు, ఏడవ నెల, ఏడవ సంవత్సరం, 17వ, 37వ 77వ సంవత్సరంలో వాళ్లకు ప్రాణగండం ఉంటుందని చెప్పారు.

డైరెక్ట్ గా ఆ నక్షత్రం గురించి చెప్తే వాళ్ళు భయపడతారు, కాబట్టి ఇలాంటివి ఇంటికి పిలిచి చెప్పాలి అంటూ క్లింకార జ్యోతిష్యం చెప్పినప్పుడు తనను విమర్శించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వేణు స్వామి.

కొన్ని రోజుల క్రితం క్లింకార జాతకం అద్భుతంగా ఉందని, ఆమె పుట్టిన ఘడియలను బట్టి చూస్తే పాపకు రాజయోగం ఉందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకు కలిసి వస్తుందని చెప్పారు వేణు స్వామి. కానీ పుట్టిన వెంటనే జాతకం చెప్పడం ఏంటి అని మండిపడ్డారు మెగా ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X