For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్‌లో కమల్ హాసన్... 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆసక్తిర విషయాలెన్నో!

|

సరిగ్గా ఇదే రోజు 1960, ఆగస్టు 12న కమల్ హాసన్ నటించిన తొలి చిత్రం 'కలాథుర్ కన్నమ్మ' చిత్రం విడుదలైంది. అప్పటికి ఇంకా కమల్ హాసన్ వయసు ఆరేళ్లు కూడా నిండలేదు. కట్ చేస్తే ఆగస్టు 12, 2019..... కమల్ హాసన్ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి 60 సంవత్సరాలు పూర్తయింది.

ఇంత సుధీర్ఘకాలం సినిమా రంగంలో కొనసాగడం, అందులోనూ దేశ గర్వించే నటుడి స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అతికొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాంటి వారిలో ఒకరు యూనివర్శల్ స్టార్, ఉళగనాయగన్ కమల్ హాసన్.

కమల్ హాసన్ తన తొలి చిత్రంలో లెజెండరీ యాక్టర్లు జెమినీ గణేశన్, సావిత్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో నటనకు గాను ఆయన బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్‌గా జాతీయ అవార్డు దక్కించుకోవడం విశేషం.

60 ఏళ్ల సినీ ప్రయాణంలో

60 ఏళ్ల సినీ ప్రయాణంలో

60 ఏళ్ల సినీ ప్రయాణంలో కమల్ హాసన్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా తనలోని బహుముఖ టాలెంటును బయటపెట్టే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. 64 ఏళ్ల కమల్ హాసన్ ఇప్పటికీ తన సినీ ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2' మూవీ చేస్తున్నారు.

#60PathBreakingYrsOfKamal

#60PathBreakingYrsOfKamal

కమల్ హాసన్ నటుడిగా 60 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. #60PathBreakingYrsOfKamal అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

హాసన్ ఫ్యామిలీ

హాసన్ ఫ్యామిలీ

శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం కమల్ హాసన్. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు.

బాలచందర్ శిష్యరికంలో

బాలచందర్ శిష్యరికంలో

కమల్ హాసన్ బాల్యంలోనే శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి.

వందల్లో అవార్డులు

వందల్లో అవార్డులు

జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు సార్లు అందుకున్నారు. మూండ్రంపిరై, నాయకన్(నాయకుడు), ఇండియన్ (భారతీయుడు) చిత్రాలకుగాను ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. తొలిచిత్రానికే ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో పాటు ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నారు. తన నట జీవితంలో ఆయన ఎన్నో వందల అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఆరు సార్లు ఆస్కార్ నామినేషన్

ఆరు సార్లు ఆస్కార్ నామినేషన్

కమల్ హాసన్ నటించిన ఆరు చిత్రాలు ఇండియా నుంచి అఫీషియల్‍‌గా ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. ఇండియాలో మరే నటుడికీ ఇలాంటి గౌరవం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1990లో పద్మశ్రీ, 2014లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.

English summary
Veteran actor Kamal Haasan has completed 60 years as actor in the industry today. On this day, in 1960, a 6-year-old child artiste made his acting debut with the acclaimed Tamil film, Kalathur Kannamma, and the rest is history.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more