గణేష్ నిమజ్జనంలో పాయల్ రాజ్‌పుత్ తీన్మార్ డాన్స్.. వైరల్ వీడియో
గణపతి బప్పా మోరియా అంటూ తెగ చిందులేసింది పాయల్ రాజ్‌పుత్. తమ ఏరియాలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలో పాల్గొన్న ఈ భామ తీన్మార్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. పైగా ఈ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది పాయల్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాయల్ హుషారు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
గణేష్ నిమజ్జన వేడుకలో డాన్స్ చేస్తున్న వీడియో క్లిప్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పాయల్.. ''దింక చికా దింక చికా.. గణపతి బప్పా మోరియా'' అని ట్యాగ్ చేసింది. మొదటి సినిమా Rx 100 ద్వారానే యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసింది. ఇటీవలే సీత సినిమాలో ఐటెం పాపగా ఉర్రూతలూగించింది.
ఇక ప్రస్తుతం RDX లవ్ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తోంది పాయల్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ యువతను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.


Click it and Unblock the Notifications











