twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయన్ నడుమును పట్టుకుని కళ్లల్లో కళ్లు పెట్టి.. గోవాలో ఎంజాయ్.. విఘ్నేష్ బర్త్ డే స్పెషల్ పిక్!!

    |

    దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ కపుల్స్‌లో నయనతార విఘ్నేష్ శివన్ కచ్చితంగా ఉంటారు. గత నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే ఉన్నారు. పెళ్లి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు గానీ ఈ జంట మాత్రం చిలకా గోరింకల్లా ప్రపంచ దేశాలన్నీ చుట్టి వస్తున్నారు. మొన్నీ మధ్యే ఈ ఇద్దరు స్పెషల్ ఫ్లైట్‌లో కొచ్చిలో దిగారు. నయన్ ఇంట్లో ఓనం పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.

    ప్రతీసారి అంతే..

    ప్రతీసారి అంతే..

    నయన్-విఘ్నేష్‌లు ప్రతీసారీ ఓనం పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. మామూలుగా కేరళలో ఓనమ్ పండుగకు ఉండే విశిష్టతే వేరు. కొత్త జంటలు, ఆలు మగళ్లుగా వీటిని ఎంతో సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. నయన్ కూడా విఘ్నేశ్‌తో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటుంది.

    సపరేట్ ఫ్లైట్..

    సపరేట్ ఫ్లైట్..

    నయన్-విఘ్నేష్ ఈ ఇద్దరూ కూడా ఓనమ్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు విదేశాల నుంచి సపరేట్ ఫ్లైట్ వేసుకుని కొచ్చికి వచ్చారు. నయన్ ఇంట్లో సంప్రదాయ బద్దంగా ఈ పండుగను జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

    గోవాలో సందడి..

    గోవాలో సందడి..

    ఓనం పండుగ సెలెబ్రేషన్స్ అయ్యాక అందరూ కలిసి గోవాకు చెక్కేశారు. ఇక అక్కడే నయన్ అమ్మ బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేశారు. విఘ్నేష్ దగ్గరుండి బర్త్ డేను నిర్వహించాడు. ఇక ఈ బర్త్ డే వేడుకుల్లో నయన్ ఆనందం ఉట్టిపడింది. మిస్ కురియన్‌కు బర్త్ డే శుభాకాంక్షలు అత్తగారికి విషెస్ చెప్పాడు విఘ్నేష్.

    వైట్ డ్రెస్‌లో హల్చల్..

    వైట్ డ్రెస్‌లో హల్చల్..

    గోవాలో ఓ హోటల్‌లో వీరు దిగినట్టు తెలుస్తోంది. ఇక నయన్ వైట్ డ్రెస్ వేసుకుని అక్కడ గార్డెన్‌లో అలా దేవకన్యలా తిరుగుతుంటే విఘ్నేశ్ తన కెమెరాలో బంధించాడు. ఇక నిజంగానే వైట్ డ్రెస్‌లో నయన్ ఫోటోలను చూస్తే అప్సరసలానే ఉంది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేశాయి.

    Recommended Video

    కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
    నడుముపై చేయి వేసి

    నడుముపై చేయి వేసి

    ఇక నేడు విఘ్నేష్ శివన్ బర్త్ డే. ఈ సందర్భంగా నయన్‌తో జాలీగా గడిపేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరూ పక్కనే నిల్చుని ఒకరి నడుముని మరొకరు పట్టుకుని, కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోయారు. ఇక ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

    English summary
    Vignesh Shivan Birthday Special Pic Enjoys With Nayanthara In Goa, Birthday vibes Wit God’s grace & all your wonderful sweet wishes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X