నయనతార హాట్ ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్: ఆమెను అలా చూస్తే తట్టుకోవడం కష్టమే

ఏమాత్రం అంచనాలు లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ నయనతార. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్న ఆమె.. దక్షిణాదిలో ఉన్న ఉత్తమ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడు కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తోనూ విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నయనతార హాట్ ఫొటోను షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 అన్ని ఇండస్ట్రీలో నయనతార హవా

అన్ని ఇండస్ట్రీలో నయనతార హవా

సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక, బడా హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఫలితంగా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిందీ బ్యూటీ.

 ఇద్దరి తర్వాత విఘ్నేష్‌తో లవ్ ట్రాక్

ఇద్దరి తర్వాత విఘ్నేష్‌తో లవ్ ట్రాక్

కెరీర్ పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. లవ్ ట్రాకుల విషయంలో మాత్రం ఏకంగా రెండు సార్లు విఫలమైంది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. వాళ్లిద్దరితో బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లలేకపోయింది. ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో లవ్ ట్రాక్ నడపడం మొదలు పెట్టింది.

 అప్పుడు సీక్రెట్‌గా.. ఇప్పుడు మాత్రం

అప్పుడు సీక్రెట్‌గా.. ఇప్పుడు మాత్రం

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. అప్పటి నుంచి ఈ జంట ఎంజాయ్ చేస్తూ దేశ వ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.

పెళ్లి కన్ఫార్మ్.. ఎప్పుడు జరుగుతుందో

పెళ్లి కన్ఫార్మ్.. ఎప్పుడు జరుగుతుందో

నయనతార.. విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా? అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే నయనతార చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఫొటోను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీళ్ల పెళ్లి కన్ఫార్మ్ అయింది.

 అక్కడ కూడా నయనతార గురించేనా

అక్కడ కూడా నయనతార గురించేనా

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో, అప్‌డేట్‌నో ఇస్తుంటాడు. అందులో కూడా ఎక్కువగా నయనతారకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌కు చెబుతున్నాడు.

నయనతార హాట్ ఫొటోను షేర్ చేస్తూ

నయనతార హాట్ ఫొటోను షేర్ చేస్తూ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విఘ్నేష్ శివన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను స్టోరీగా పెట్టుకున్నాడు. అందులో నయనతారకు సంబంధించిన పిక్ కూడా ఒకటి ఉంది. ఇందులో ఈ బ్యూటీ క్యాజువల్ టాప్ ధరించి ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. అలాగే, కొంటెగా చూస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ పిక్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

 విఘ్నేష్‌పై నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం

విఘ్నేష్‌పై నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం

సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన హాట్ ఫొటోను విఘ్నేష్ శివన్ షేర్ చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సమయం సందర్భం లేకుండా అలాంటి పిక్‌ను పోస్ట్ చేసిన అతడిపై నయన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆమె పర్సనల్ ఫొటోలను ఎందుకలా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నావంటూ అతడిపై విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X