నయనతార సీక్రెట్ ఫొటో పెట్టమన్న నెటిజన్: ఏకంగా పర్సనల్ పిక్ లీక్ చేసిన విఘ్నేష్ శివన్

సాదాసీదాగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ నయనతార. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్న ఆమె.. దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితోనూ విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నయనతారతో ఉన్న పర్సనల్ ఫొటోను షేర్ చేశాడు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్. ఆ వివరాలు మీకోసం!

అందరి ఫస్ట్ ఛాయిస్ నయనతారే

అందరి ఫస్ట్ ఛాయిస్ నయనతారే

చాలా కాలంగా దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్‌ను అందుకుంటోంది. ఇక, బడా హీరోలకు ఆమె ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఫలితంగా చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.

రెండు బ్రేకప్‌ల తర్వాత విఘ్నేష్‌తో

రెండు బ్రేకప్‌ల తర్వాత విఘ్నేష్‌తో

సినిమాల పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. లవ్ ట్రాకుల విషయంలో మాత్రం ఏకంగా రెండు సార్లు ఫెయిల్ అయింది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. వాళ్లిద్దరితో బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లలేకపోయింది. ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో లవ్ ట్రాక్ నడుపుతూ సాగుతోంది.

మొదట్లో సీక్రెట్‌గా.. ఇప్పుడు ఇలా

మొదట్లో సీక్రెట్‌గా.. ఇప్పుడు ఇలా

నయనతార.. విఘ్నేష్ శివన్ కలిసి 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. అప్పటి నుంచి ఈ జంట ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ దేశ వ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్ అవుతూనే ఉంది.

పెళ్లి గురించి క్లారిటీ మాత్రం రావట్లే

పెళ్లి గురించి క్లారిటీ మాత్రం రావట్లే

చాలా కాలంగా నయనతార.. విఘ్నేష్ శివన్ ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా? అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే నయనతార చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఫొటోను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ క్రేజీ కపుల్ మ్యారేజ్‌ త్వరలోనే అని అంటున్నారు.

విఘ్నేష్ చాట్... నయన్ గురించే

విఘ్నేష్ చాట్... నయన్ గురించే

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలోనే నిత్యం ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలను పంచుకుంటుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా చాలా మంది నెటిజన్లు నయనతారతో రిలేషన్ గురించి అతడిని ప్రశ్నలు అడిగారు.

సీక్రెట్ ఫొటోను పెట్టమన్న నెటిజన్

సీక్రెట్ ఫొటోను పెట్టమన్న నెటిజన్

విఘ్నేష్ శివన్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో నెటిజన్లంతా నయనతారతో అతడికి ఉన్న రిలేషన్.. వాళ్లిద్దరి మధ్య జరిగిన సీక్రెట్ విషయాలను అడిగే ప్రయత్నాలు జరిపారు. వాటిలో చాలా ప్రశ్నలకు అతడు సహనంగానే సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ 'మీరు, నయనతార మేడం దిగిన సీక్రెట్ ఫొటోను షేర్ చేయండి' అని విఘ్నేష్ శివన్‌ను అడిగాడు.

పర్సనల్ పిక్‌ను లీక్ చేసిన విఘ్నేష్

పర్సనల్ పిక్‌ను లీక్ చేసిన విఘ్నేష్

నెటిజన్ అడగ్గానే విఘ్నేష్ శివన్.. నయనతారతో దిగిన ఓ సీక్రెట్ ఫొటోను షేర్ చేశాడు. ఇది ఓ రూమ్‌లో తీసిన పర్సనల్ ఫొటో. ఇందులో ఇద్దరూ అద్దం ముందర నిల్చుని సెల్ఫీలా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఈ పర్సనల్ ఫొటోను విఘ్నేష్ పోస్ట్ చేశాడు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X