అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’కు ఏడాది.. విజయ్ దేవరకొండ క్రేజీ పోస్ట్!
ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఆహా దూసుకెళ్తోంది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. కొత్త టాలెంట్‌కు, యువతకు అవకాశాలు ఇస్తోంది. కొత్త కొత్త షోలను డిజైన్ చేస్తోంది. వెండితెరపై చూపించలేని, చెప్పలేని కథలకు ఆహా ఆహ్వానం పలికింది. అలా లాక్డౌన్‌లో ఎన్నో మంచి చిత్రాలు ఆహాలో మెరిశాయి. రోజురోజుకి ఆహా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఆహాను నిలబెట్టేందుకు అల్లు అరవింద్ మంచి ప్లానే వేశాడు.
ముందే చాలా సినిమాలను ఆహాకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నాడు. చిన్న చిత్రాలకు ఆహా మంచి వేదికగా మారింది. పైగా దీని లాంచింగ్, ప్రమోషన్స్‌ను అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నందినీ రెడ్డి, సమంత వంటి వారి చేత చేయించాడు. ప్రత్యేకంగా సామ్ జామ్ షో బాగానే క్లిక్ అయింది. సమంత నిర్వహించిన ఈ షోలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చిరంజీవి వంటి వారు గెస్ట్‌లుగా విచ్చేశారు.

మొత్తానికి ఆహా వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశాడు. యాయ్.. ఆహాకు ఏడాది నిండింది.. తెలుగు ఓటీటీని మీకు పరిచయం చేసి ఏడాది పూర్తవుతోంది.. ఇప్పటికే మీరు మాకు చాలా ప్రేమను అందించారు.. పెద్ద షోలు, మంచి కంటెంట్ మీకోసం వచ్చాయి ఇంకా రాబోతోన్నాయంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. విజయ్ ప్రస్తుతం లైగర్ మూవీ కోసం సిద్దమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











