Vijay Deverakonda Kushi: విజయ్ దేవరకొండకు పోటీగా రష్మిక మాజీ ప్రియుడు... ఇద్దరిలో గెలుపెవరిదో మరి?

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే పాన్ ఇండియా స్టాయిలో ఈ సినిమా రిలీజ్ కానుండగా... కన్నడంలో అదే రోజున రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సినిమా రిలీజ్ కానుంది. ఇక విజయ్ తో రక్షిత్ శెట్టి పోటీకి దిగబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య ఉన్న రిలేషన్ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరు ప్రేమలో ఉన్నారంటూ... నిత్యం ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది. అయితే వీటిపై విజయ్ కానీ, రష్మిక కానీ స్పందించలేదు.. మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకు తిరుగుతున్నారు. విజయ్, రష్మిక కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

vijay devarakonda rashmika

అయితే గీతగోవిందం సినిమాకు ముందే రష్మిక.. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమ.. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. మరి ఏమైందో తెలియదు.. రష్మిక రక్షిత్ కు బ్రేకప్ చెప్పే.. ఎంగేజ్మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసింది. దీనికి కారణం విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడటమే అనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించాయి.

vijay devarakonda rakshit shetty

గీత గోవిందం తర్వాత రష్మిక, విజయ్ లు కలిసి వెకెషన్ కు పోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. వీళ్లు ఒకే దగ్గర ఉన్నట్లు ఫ్యాన్స్ కు హింట్స్ కూడా ఇచ్చారు. ఇక రష్మిక మొన్న విజయ్ వేసుకున్న షర్ట్ వేసుకుని తిరిగింది. ఆ ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ.. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో పోటీకి దిగబోతున్నారు. ఇది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో మాత్రమే.

kushi movie

విజయ్ దేవరకొండ.. సమంతతో కలిసి ఖుషి అనే సినిమా చేశాడు. ఇది సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ చిత్రాల దర్శకుడు శివనిర్వాణ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంటును హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు హీందీలోనూ రిలీజ్ కానుంది. ఇక అదే రోజు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సప్త సాగర దాచే ఎల్లో కన్నడలో రిలీజ్ కానుంది.

Sapta Sagaradaache yello

విజయ్ కు హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. లైగర్ హిట్టు కాకపోయినా... కరణ్ జోహర్ పుణ్యమా అని మంచి క్రేజ్ అయితే లభించింది. ఇక సమంతకు తమిళ్ లో క్రేజ్ ఉండగా.. ఇక మలయాళంలో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఫేమస్. అక్కడ ఆయన పలు చాట్ బస్టర్స్ అందించిన సంగతి తెలిసిందే. అయితే కన్నడంలో ఫుల్ క్రేజ్ ఉన్న మరి రక్షిత్ శెట్టిని తట్టుకుని విజయ్ మార్కెట్ నిలబెట్టుకుంటారా అనేది చూడాలి. మొత్తానికి వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద వార్ నడవనుంది. మరి ఎవరు నిలబడనున్నారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X