విజయ్ దేవరకొండ సాయం.. అలా కృతజ్ఞత తెలిపిన అభిమాని

విజయ్ దేవరకొండ కరోనా లాంటి కష్టకాలంలో వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చాడు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరిటి కొంత విరాళమిచ్చి.. తన అభిమానుల నుంచి మరికొంత మొత్తానికి విరాళంగా కోరిన సంగతి తెలిసిందే. అలా దాదాపు 75 లక్షలకు పైగా అవసరమున్న వారికి పంచాడు. వారికి నిత్యావసర సరుకులను అందించాడు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం చేశాడు. తాజాగా ఆ సాయం ప్రేమ రూపంలో తిరిగి వచ్చింది.

అలా విజయ్ దేవరకొండ నుంచి సాయం పొందిన ఓ అభిమాని ప్రేమగా అన్నయ్యా అని పిలుస్తూ తన అభిమానాన్ని చాటుకుంది. దివ్యాంగురాలైన స్వప్నిక అనే అభిమాని.. తన నోటితోనే విజయ్ బొమ్మను గీసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు. అలా విజయ్ దేవరకొండ చేసిన సాయం ఇప్పుడు ఇలా ప్రేమగా తిరిగి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేశాడు.

Vijay Devarakonda Specially ABled Fan Art Video

అభిమాని గీసిన బొమ్మను ఆమెస స్పిరిట్‌ను చూసిన విజయ్ దేవరకొండ.. నీ నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందాను. థ్యాంక్స్‌ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం విజయ్ ట్వీట్.. అన్నయ్య అంటూ అభిమాని పిలిచిన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X