రౌడీ అబ్బాయిలు.. రౌడీ అమ్మాయిల షికార్లు.. విజయ్ దేవరకొండ ఇందులో కూడా ముందేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరో స్థాయి క్రెడిట్ కొట్టేసిన హీరోలు కొంతమందే. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా వరకు ఈయనంటేనే తెలియని ప్రేక్షకులు.. అర్జున్ రెడ్డి థియేటర్స్ లోకి వచ్చిన వారం రోజుల్లో ఇతనికి అడిక్ట్ అయిపోయారు. రియల్ హీరో అంటే ఇతనే అన్నట్లుగా ప్రేక్షకులు ట్రీట్ చేయడం, ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించడంతో విజయ్ దేవరకొండ సెన్సేషన్ స్టార్ అయిపోయాడు.

అర్జున్ రెడ్డి ఇచ్చిన ఒక్క విజయమే ఆయనను స్టార్ హీరో చేసింది. దీంతో వరుస అవకాశాలతో బిజీ అయిన ఈయన ఫ్యామిలీతో సరదాగా కనిపించిన సందర్భాలు లేవు. ఆ కోణంలో విజయ్‌ని చూడాలని ఆరాటపడ్డారు ప్రేక్షకులు. దీంతో ఇన్ని రోజులకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. తన కుటుంబంతో సరదాగా టూర్ వేసి తాను ఇలాంటి వాటిల్లో కూడా తక్కువేం కాదు అని నిరూపించాడు విజయ్ దేవరకొండ. గత కొంతకాలంగా తన సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్‌లో అమ్మా నాన్న, తమ్ముడు ఆనంద్, ప్రొడ్యూసర్ యాష్ రంగినేని ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వేశాడు విజయ్.

Vijay Deverakonda enjoyed in South France with his family

ప్రస్తుతం ఈ రౌడీగారి కుటుంబం అంతా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ ట్రిప్ సంగతులను తెలుపుతూ విజయ్ దేవరకొండ అంకుల్ యాష్ రంగినేని సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. దీనికి "#రౌడీ అబ్బాయిలు.. రౌడీ అమ్మాయిలు సౌత్ ఫ్రాన్స్‌లో ఫ్యామిలీ హాలిడేలో ఎంజాయ్ చేస్తున్నారు" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో విజయ్ దేవరకొండ స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకొని, కలర్ఫుల్ క్యాప్ అలాగే స్టైలిష్ గాగుల్స్ ధరించి యమ జోష్ లో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సరదా చూసి ముచ్చట పడుతున్నారు ఆయన అభిమానులు.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' అనే సినిమాల్లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X