twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు బతికేదే మా మీద.. చెత్త, చిల్లర ప్రచారంతో బ్లాక్ మెయిల్.. విజయ్ దేవరకొండ ఫైర్

    |

    మీడియాలో తనపై కక్షపూరితంగా రాస్తున్న కొన్ని వెబ్‌సైట్లపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మండిపడ్డారు. గత కొద్దికాలంగా తనను టార్గెట్ చేసినా పట్టించుకోలేదని, కరోనా సంక్షోభం సమయంలో ఉద్దేశపూర్వంగా తప్పుడు రాయడంతో స్పందించాల్సి వస్తున్నది. అందుకే ఈ సమయంలో వీడియో ద్వారా వారి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు నిజాలేంటో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

    విజయ్ దేవరకొండ వీడియో రిలీజ్

    విజయ్ దేవరకొండ వీడియో రిలీజ్

    ప్రజలు అబద్దాల ట్రాప్‌లో పడకుండా ఉండటమే ఈ వీడియో ఉద్దేశమని విజయ్ దేవరకొండ చెబుతూ.. ఏ సంక్షోభాల సమయంలోనైనా మూడు రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకటి సమయానికి డబ్బు, జీతాలు, తినడానికి ఆహారం లభించక ఉండేవారు. రెండోది తోటి బాధపడేవారికి అండగా ఉంటూ సహాయం చేస్తూ ఉంటారు. మూడో రకం వారు కష్ట సమయాల్లో కూడా పక్కన వాడిని తొక్కేసి లాభం పొందాలనుకొనేవారు. వీళ్ల దేశానికి చాలా డేంజర్ అని విజయ్ దేవరకొండ అన్నారు.

    మూడో రకం ప్రజలు తీరు ఇదే

    మూడో రకం ప్రజలు తీరు ఇదే

    మూడో రకంలోకి వచ్చేవి కొన్ని వెబ్‌సైట్లు టాలీవుడ్‌లో ఉన్నాయి. ఏడాది క్రితమే మూడు నాలుగు వెబ్‌సైట్లను బ్యాన్ చేశాను. ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్లు, డైరెక్టర్లు, సాంకేతిక నిపుణుల ఈ వెబ్‌సైట్ల బాధితులు. మన వల్లే ఆర్థికంగా సహాయం పొంది.. మనపైనే బురద జల్లుతున్నాయి. చాలా మంది జర్నలిస్టులు, వెబ్‌సైట్లు నిజాయితీగా పనిచేసే వాళ్లు నాకు తెలుసు అని అన్నారు,

    ఎంతకైనా తెగిస్తారు..

    ఎంతకైనా తెగిస్తారు..

    టాలీవుడ్‌లో మూడు, నాలుగు వెబ్‌సైట్లకు సంబంధించిన వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. వ్యక్తిగత జీవితాల్లోకి దూరుతారు. దారుణంగా వ్యవహరిస్తారు. బ్లాక్ మెయిల్ చేయడానికైనా సిద్ధం. ఆ మూడు వెబ్‌సైట్ల కుమ్మక్కై హెడ్డింగులు తారుమారు చేసి వార్తలు ప్రచురిస్తారు. సినిమా రేటింగులను మ్యానుప్లేట్ చేస్తారు. ఇలాంటి వెబ్‌సైట్లు నాపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సినీ పరిశ్రమకు సహాయం చేయారా? అని ప్రశ్నిస్తున్నారు.

    మేమిచ్చే యాడ్స్ వల్లే మీ బతుకు

    మేమిచ్చే యాడ్స్ వల్లే మీ బతుకు

    తనను ప్రశ్నించే అధికారం మీకెక్కడిది అంటూ విజయ్ దేవరకొండ ప్రశ్నించారు. మీరు బతికేదే మా ఇండస్ట్రీ మీద. మీ వెబ్‌సైట్లు సినిమా ఇండస్ట్రీ ఇచ్చే యాడ్స్ మీదే బతుకుతాయి. యాడ్స్ ఇవ్వకపోతే సినిమాలపై దుష్ర్పచారం చేస్తారు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే చెత్త వార్తలు రాస్తారు. చిల్లర వార్తలు రాసి డబ్బుల సంపాదిస్తారు. డొనేషన్లైనా, ఏవైనా నాకు ఇష్టం ఉన్నప్పుడు.. నాకు నచ్చినప్పుడు.. ఎవరికి ఇవ్వాలో.. ఎవరికి ఇవ్వొద్దో నా మనసు చెప్పనట్టు నడుచుకొంటాను. నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అని విజయ్ దేవరకొండ అన్నారు.

    Recommended Video

    Raashi Khanna Shocking Decision On Telugu Cinema

    మిడిల్ క్లాస్ ఫండ్ గురించి విజయ్ దేవరకొండ

    కరోనా కారణంగా బాధపడుతున్న ప్రజలను చూసి ఏప్రిల్ 26వ తేదీన మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో ఓ చారిటీని, వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. దాని ద్వారా 25 లక్షల కార్పస్ ఫండ్‌తో మొదలుపెట్టి.. ఆర్థికంగా బాగా ఉన్న వారిని విరాళాలు అడిగాం. దాదాపు 75 లక్షల రూపాయల సమకూర్చుకొని 7500 మంది కుటుంబాలకు చేరువయ్యాం. మా వెబ్‌సైట్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాంటి వెబ్‌సైట్ ఎందుకు పెట్టారని ఈ మూడు నాలుగు వెబ్‌సైట్లు ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు ఆ అర్హత ఉందా అని విజయ్ దేవరకొండ ప్రశ్నించారు. ఓ వెబ్‌సైట్ రాసిన తప్పుడు ఆర్టికల్‌పై విజయ్ దేవరకొండ ధ్వజమెత్తారు.

    English summary
    Actor Vijay Deverakonda serious over Gossip news in few Telugu websites related to Middle class fund. He fault a website news about middle class fund and coronavirus crisis fund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X